Begin typing your search above and press return to search.

ఫేస్ యాప్ మ‌రోకోణం..18 ఏళ్ల త‌ర్వాత అత‌డు దొరికాడు

By:  Tupaki Desk   |   22 July 2019 6:52 AM GMT
ఫేస్ యాప్ మ‌రోకోణం..18 ఏళ్ల త‌ర్వాత అత‌డు దొరికాడు
X
ఇటీవ‌ల కాలంలో ఫేస్ యాప్ మీద వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు అన్ని ఇన్ని కావు. ప్రైవేటు డేటాను దుర్వినియోగం చేస్తుందంటూ ఫేస్ యాప్ మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. ఇప్ప‌టి ఫోటోతో భ‌విష్య‌త్తులో ఎలా ఉంటార‌న్న విష‌యాన్ని చెప్పే ఈ యాప్ మీద వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అన్ని ఇన్ని కావు. చైనాకు చెందిన కంపెనీ రూపొందించిన ఈ యాప్ ను త‌ప్పు ప‌ట్టే వారే ఎక్కువ‌.

ప్ర‌తి విష‌యంలోనూ నెగిటివ్..పాజిట‌వ్ అంశాలు ఉన్న‌ట్లే.. ఫేస్ యాప్ లోనూ ఫ్ల‌స్సులు.. మైన‌స్సులు ఉంటాయ‌న్న విష‌యం తాజాగా రుజువైంది. ఫేస్ యాప్ లోని పాజిటివ్ కోణం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చైనాలో 18 ఏళ్ల క్రితం మిస్ అయిన కుర్రాడ్ని తాజాగా గుర్తించారు.

ప‌ద్దెనిమిదేళ్ల క్రితం ఇంటి ద‌గ్గ‌ర ఆడుకుంటున్న వేళ‌లో కిడ్నాప్ అయిన తమ కుమారుడి కోసం చైనాకు చెందిన దంప‌తులు చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. ఈ నేప‌థ్యంలో మూడేళ్ల వ‌య‌సులో ఉన్న ఆ కుర్రాడి ఫోటోను ఫేస్ యాప్ ద్వారా తాజాగా ఎలా ఉంటాడ‌న్న విష‌యాన్ని రూపొందించారు.

ఫేస్ యాప్ అప్లికేష‌న్ సాయంతో వెతికిన చైనా పోలీసుల‌కు 18 ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన షై యు వియ్ ఫింగ్ ను గుర్తించారు. కృత్రిమ మేథోసంప‌త్తి సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి రూపొందించిన ఫేస్ యాప్ కార‌ణంగా న‌ష్టాలే త‌ప్పించి లాభాలే ఉండ‌వ‌న్న విమ‌ర్శ‌ల‌కు తాజాగా ఉందతం చెక్ పెట్టిన‌ట్లైంది. 2001లో మిస్ అయిన ఈ కుర్రాడ్ని తాజాగా గుర్తించి.. వారి త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేర్చారు. దీంతో.. వారి ఆనందానికి అవ‌ధులు లేని ప‌రిస్థితి.