Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ లో వక్షోజాల బొమ్మ ఉంచిందని!
By: Tupaki Desk | 17 Nov 2016 10:30 PM GMTసామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తన ఖాతాదారుల పట్ల సకల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవసీ పాలసీకి విరుద్ధంగా ఉండే ఫోటో పోస్ట్ చేశారంటూ ఓ మహిళ రచయిత్రికి షాకిచ్చింది. ఫేస్ బుక్‌లో మహిళ వక్షోజాల బొమ్మ ఉంచినందుకు ఫెమినిజం ఇన్ ఇండియా అనే సంస్థ స్థాపకురాలు అయిన జప్లీన్ పశ్రిచాకు ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. ఆమెను మూడు రోజుల పాటు ఫేస్‌బుక్ నుంచి బ్లాక్ చేసింది. అయితే సదరు రచయిత్రికి ఇదే మొదటి సారి కాకపోవడం గమనార్హం.
మహిళా పక్షపాత రచయిత అయిన జప్లీన్ పశ్రిచా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ....‘ఐ వాజ్ అషెమ్‌డ్ ఏట్ మై బ్రెస్ట్: ఆన్ బ్రాస్ అండ్ బ్రెస్ట్స్’ పేరిట తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ వ్యాసాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వెబ్‌సైట్ లింక్‌లో బ్రా ఫొటో ఉండటంతో ఆర్టికల్‌ను ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. తమ పాలసీలకు విరుద్ధమైన చిత్రాన్ని పోస్టు చేసినందుకు ఆమెను మూడురోజులపాటు సైట్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఫేస్ బుక్ తెలిపింది. దీనిపై జప్లీన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బూతు బొమ్మలు, వీడియోలను పోస్ట్ చేస్తే బ్లాక్ చేయాలి కాని ఇదేం నిర్ణయమని ప్రశ్నించింది. ఇదిలాఉండగా జప్లీన్‌ను ఫేస్ బుక్ బ్లాక్ చేయడం ఇది నాలుగవ సారి. ఛాతిపై సగం కప్పుకొని ఉన్న ఓ ఆఫ్రికా మహిళ మోటార్ బైకు నడుపుతున్న ఫొటోను షేర్ చేసుకున్నందుకు ఒకసారి, వక్షోజాల పై కవిత రాసి.. సదరు ఫొటోను పోస్టుచేసినందుకు రెండోసారి, 2004లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా మణిపూర్ మహిళల నగ్నంగా నిరసన తెలిపిన ఫొటోను పెట్టినందుకు మూడోసారి ఆమెను ఫేస్‌బుక్ బ్యాన్ చేసింది. అశ్లీలానికి దూరంగా ఉండాలనే నిర్ణయంలో భాగంగా ఇటీవల ఫేస్‌బుక్ కఠినంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.