Begin typing your search above and press return to search.
డొనాల్డ్ ట్రంప్ కి షాకిచ్చిన ఫేస్ బుక్!
By: Tupaki Desk | 9 Sep 2016 5:18 PM GMTఅమెరికా ఎన్నికల్లో అద్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు ఈమధ్య కాలంలో కొంత మద్దతు పెరిగిందని సర్వేలు చెబుతున్న తరుణంలో.. ఫేస్ బుక్ నుంచి గట్టి షాకే తగిలింది. ఇదే సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ కి భారీ ఆఫర్ వచ్చింది. ఈ మేరకు కొన్ని విషయాలను ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మొస్కోవిట్జ్ ప్రకటన చేశారు. తన భార్య కరి - తాను కలిసి డెమొక్రటిక్ పార్టీకి రూ.134 కోట్ల భారీ విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు డస్టిన్ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఒక ఇండివిడ్యువల్ పర్సన్ గా ఈ దేశం, సమాజం ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోబోతున్నామో నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో తెలుస్తుందని తన బ్లాగులో రాసుకొచ్చిన డస్టిన్... తను, తన భార్య కలిసి ఒక రాజకీయ పార్టీ అభ్యర్ధికి బాసటగా నిలుస్తూ, ఈ స్థాయిలో భారీ విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
ఇలా భారీ విరాళంతో, మద్దతైన మాటలతో హిల్లరీకి ప్రోత్సాహం అందించిన డస్టిన్ మొస్కోవిట్జ్.. ఆమె ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం గట్టి షాకిచ్చారు. డోనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ కలిసి ఎన్నికల ప్రచారంలో ఎంతో గుడ్డిగా ప్రవర్తిస్తున్నారని, ఇమిగ్రేషన్ పై వారు చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో అమెరికన్లతో పాటు ఇతర దేశాల పౌరులను కూడా బాధిస్తాయని తన బ్లాగులో పేర్కొన్నారు. అమెరికా యోగక్షేమాలు, ఇతరదేశాల పౌరుల మంచి కోరి తాను క్లింటన్ కు చేస్తున్న ఈ చిన్నసాయం కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు డస్టిన్ చెప్పారు.