Begin typing your search above and press return to search.

అంబానీకి ఫేస్ బుక్ పంచ్!

By:  Tupaki Desk   |   14 Sep 2019 1:30 AM GMT
అంబానీకి ఫేస్ బుక్ పంచ్!
X
ఫేస్ బుక్‌ లో భార‌తీయ యూజ‌ర్లు పంచుకునే వ్య‌క్తిగ‌త స‌మాచారాన్నంతా ఆ సంస్థ గుప్పిట ఉండ‌టం మీద త‌ర‌చుగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. ఆ సంస్థ ఈ స‌మాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త వ్యాపార దిగ్గ‌జం ముకేష్ అంబానీ.. ఫేస్ బుక్ స‌హా విదేశీ సంస్థ‌ల ద‌గ్గ‌ర భార‌త యూజ‌ర్ల డేటా ఉండ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు. డేటాను ‘న్యూ ఆయిల్‌’ గా పేర్కొన్న ముకేష్‌.. సోష‌ల్ మీడియా - ఇంటర్నెట్ లో భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని.. దేశ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాల‌ని.. అంతర్జాతీయ కార్పొరేట్లు కాద‌ని అన్నారు. దీనిపై ఫేస్ బుక్ ఘాటుగా స్పందించింది. ముకేష్ కు ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ నిక్ క్లెగ్ కౌంట‌ర్ ఇచ్చాడు.

డేటా అన్నది ముకేష్ అన్న‌ట్లుగా న్యూ ఆయిల్ కాద‌ని.. దీన్ని ఒక దేశం పరిధిలోనే డేలా నిల్వ చేయడం క‌రెక్ట్ కాద‌ని క్లెగ్ అన్నాడు. భారత్ లాంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా - సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అత‌ను అభిప్రాయ‌ప‌డ్డాడు. ‘‘భారత్‌ లో చాలా మంది.. ప్రపంచ వ్యాప్తంగా కొంద‌రు డేటాను కొందరు కొత్త ఆయిల్‌ గా భావిస్తున్నారు. దేశం పరిధిలో భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక డేటాకు తీసుకురావ‌డం పొరపాటే అవుతుంది. తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని - ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతీ ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్‌కు భారత్‌ కొత్త నిర్వచనం చెప్పాలి. జాతి భద్రత దృష్ట్యా భారత్‌ వంటి దేశాలకు డేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు - ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్‌ గొప్ప చర్యలనే చేపట్టింది’’ అని క్లెగ్ పేర్కొన్నాడు.