Begin typing your search above and press return to search.
ఓహ్.. ఫేస్ బుక్ కూడా మామూలు కంపెనీనే
By: Tupaki Desk | 14 Aug 2015 4:13 AM GMTప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫేస్ బుక్ అనగానే.. చాలా గొప్పలు చెప్పేస్తుంటారు. అక్కడ సృజనాత్మకతకు పెద్దపీట వేస్తారని.. సంప్రదాయ కంపెనీల్లో మాదిరి వ్యవహరించరని.. కంపెనీ తప్పులు చెబితే నెత్తిన పెట్టుకుంటారని.. బహుమతులతో సర్ ప్రైజ్ లు చేస్తారు లాంటి చాలామాటలే ఇప్పటివరకూ విని ఉండొచ్చు. కానీ.. ఆ కంపెనీ కూడా మిగిలిన కంపెనీల మాదిరే అని తాజాగా తేలిపోయింది.
మాటల్లో చెప్పుకునేంత గొప్పతనం చేతల్లో లేదని తేలిపోయింది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు ఫేస్ బుక్ లోని ఓ పెద్ద లోపాన్ని కనిపెట్టాడు. దాన్ని ఫేస్ బుక్ తట్టుకోలేకపోయింది. ఇంకా విద్యార్థి అయినా ఆ కుర్రాడికి ఫేస్ బుక్ లో ఇంటర్న్ షిప్ రద్దు చేసి బయటకు పంపింది.
హార్వర్డ్ వర్సిటీలో చదువుకొన్న అరన్ ఖన్నా అనే భారత సంతతికి చెందిన ఒక యువ ఇంజనీర్ ఓ ప్లగిన్ రూపొందించాడు. దాని ఆధారంగా ఫేస్ బుక్ మెసెంజర్ లో ఉన్న అతి పెద్ద లోపాన్ని బయటపెట్టాడు. మెసంజర్ ద్వారా ఎవరితోనైనా ఛాట్ చేస్తుంటే.. ఛాట్ చేసే వారు ఎక్కడున్నారన్న విషయాన్ని అవతల వారు గుర్తించే వీలుంది. అంటే.. హైదరాబాద్ లో ఉండి.. ఐయామ్ ఇన్ ఢిల్లీ అని కబుర్లు చెబితే ఇట్టే దొరికిపోవటం ఖాయమన్న మాట. దీన్ని గుర్తించిన ఇతగాడు ఓ ప్లగిన్ రూపొందించాడు. దీన్ని కానీ డౌన్ లోడ్ చేసుకుంటే.. ఒక ఛాట్ లో ఉన్న వారంతా ఎక్కడెక్కడివారు.. అన్న విషయం స్పష్టంగా తెలుసుకునే వీలుంది. ఈ విషయాన్ని అరన్ కనిపెట్టి ఒక ప్లగిన్ తయారు చేస్తే.. దాన్ని దాదాపు 85 వేల మంది వరకూ డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఫేస్ బుక్.. అతగాడి ప్లగిన్ ను తీసేయాలని చెప్పి.. మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే.. ఫేస్ బుక్ లోపాన్ని కనుగొన్న ఈ కుర్రాడి గురించి అమెరికా మీడియా ప్రముఖంగా ప్రచురించటమే కారణం. ఫేస్ బుక్ చెప్పినట్లే అరన్ చేసినా.. అతన్ని కంపెనీ నుంచి తీసేశారు. అతన్ని తీసేసే సమయానికి.. తన మెసెంజర్ యాప్ లోని లోపాన్ని సరిదిద్ది అప్ డేట్ చేసింది. తప్పుల్ని పట్టుకున్న వారికి బహుమతులు పంచినట్లుగా గొప్పలు చెప్పుకునే ఫేస్ బుక్ అరన్ విషయంలో ఏం చెబుతుంది..?