Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్ డేటా లీక్ ... ఐర్లాండ్ కోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   17 April 2021 12:30 PM GMT
ఫేస్‌బుక్ డేటా లీక్ ... ఐర్లాండ్ కోర్టు సంచలన నిర్ణయం
X
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ డేటా లీక్ అవ్వడం అనేది ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. దాదాపుగా 53.3 కోట్ల మంది డేటా లీక్‌ అయినట్లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. యూజర్ల పర్సనల్ ఫోన్ నంబర్లు సహా 50 కోట్లకు పైగా ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక హ్యాకర్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించి ఐర్లాండ్ కు చెందిన కోర్టులు కేసులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరైతే తమ ప్రైవసీకి భంగం కలిగిందని భావిస్తున్నారో వారంతా కేసులు పెట్టవచ్చని ఐరిష్ కోర్టులు చెప్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఫేస్ బుక్ మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేదని , యూజర్లకి సంబంధించి ఎలాంటి డాటా లీక్ కాలేదని అంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలోన్ గాల్ ప్రకారం, ఆ డేటాబేస్ జనవరి నుండి హ్యాకర్ సర్కిల్ ‌లలో చెలామణి అవుతున్న ఫేస్ బుక్-లింక్డ్ టెలిఫోన్ నంబర్ లు లానే కనిపిస్తుందని తెలిపారు. ఫేస్ బుక్ డేటా లీక్ 106 దేశాల నుండి 533 మిలియన్లకు పైగా ఫేస్ బుక్ ఖాతాలను తాకింది. వీటిలో భారతదేశంలో 6 మిలియన్లకు పైగా వినియోగదారులు, యుఎస్ లో 32 మిలియన్లు మరియు యుకెలో 11 మిలియన్లు ఉన్నారు. అయితే ఈ డేటా చాలా పాతది మరియు 2019 ఆగస్టులో పరిష్కరించిన సమస్యకు సంబంధించినదని ఫేస్ బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.