Begin typing your search above and press return to search.
కరోనా తర్వాత భారత్ దే హవా...ఇదిగో సాక్ష్యం!
By: Tupaki Desk | 22 April 2020 4:30 PM GMTఇప్పుడంతా ఎక్కడ చూసినా కరోనా ముచ్చట్లే. అదే సమయంలో కరోనా కారణంగా అన్ని రంగాలూ నానా పాట్లూ పడుతున్నాయి. అసలు కరోనా ఎంతకాలం పాటు తన విలయాన్ని చూపుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఇతర చిన్న దేశాల మాదిరిగానే.. కరోనా దెబ్బతో నానా ఇబ్బందులూ పడుతోంది. సరే... కరోనాను కట్టడి చేసేందుకు దాదాపుగా అన్ని దేశాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న నేపథ్యంలో ఇంకో నెలకో, రెండు నెలలకో.. కరోనా తన విలయాన్ని ఆపక తప్పదు. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? దీనిపైనా ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చల్లో ఇప్పుడు ఓ కొత్త అంశం అందరినీ ఆసక్తికి గురి చేస్తోంది. కరోనా విలయం తర్వాత ప్రపంచ ఆర్థిక కేంద్రంగా భారత్ ఆవిష్కరించనుందట,
ఇదేదో ఉబుసుపోని కబురు ఎంతమాత్రమూ కాదు. ఈ వాదన నిజమేననేందుకు పక్కా ఆధారాలూ ఉన్నాయి. అవేంటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. బుధవారం భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఓ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని కీలక విభాగం జియోలో 9.99 శాతం వాటాను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు అమ్మేస్తున్నట్లుగా అంబానీ చెప్పుకొచ్చారు. ఇందుకోసం జియోకు రూ.43,574 కోట్లను ఫేస్ బుక్ చెల్లించనుందని కూడా అంబానీ చెప్పుకొచ్చారు. ఇది భారీ డీలేనని, దీనిపై చాలా రోజులుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయని, త్వరలోనే ఈ డీల్ పూర్తి కానుందని కూడా అంబానీ తేల్చేశారు.
ఇలా ముఖేశ్ నోట నుంచి ఈ ప్రకటన వచ్చీ రాగానే... ఈ డీల్ వెనుక ఉన్న అసలు కిటుకును బయటపెట్టేందుకు భారత పారిశ్రామిక రంగానికి చెందిన మరో కీలక వ్యక్తి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫేస్ బుక్ తో జీయో డీల్ ఆ రెండు కంపెనీలకు మాత్రమే మేలు కలిగించదు. వైరస్ కష్టాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. వైరస్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందోననడానికి ఈ డీల్ బలమైన సంకేతం. ప్రపంచ వృద్దికి ఇండియా సరికొత్త కేంద్రం కానుందన్న ఉహకు ఇది బలమైన సంకేతం. అంబానీ చాలా చక్కటి డీల్ కుదుర్చుకున్నారు’’ అని మహీంద్రా తన సందేశాన్ని వినిపించారు. మహీంద్రా వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనని త్వరలోనే తేలుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ నిజంగానే కొత్త కేంద్రంగా మారుతుందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.