Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆగ్రహ జ్వాలలు..ఫేస్‌బుక్‌ ను తాకిన సెగ, ఉద్యోగుల తిరుబాటు !

By:  Tupaki Desk   |   1 Jun 2020 1:30 PM GMT
అమెరికాలో ఆగ్రహ జ్వాలలు..ఫేస్‌బుక్‌ ను తాకిన సెగ, ఉద్యోగుల తిరుబాటు !
X
అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. గత సోమవారం మిన్నెపొలిస్‌ లో పోలీస్‌ అధికారి చేతిలో హత్యకుగురైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ కు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల శాంతియుతంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల సెగ ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాకింది. ఉద్యోగులు అధినేత పై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్‌బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాలిఫోర్నియా మెన్‌లో పార్క్ ‌లో గల ఫేస్‌ బుక్ కార్యాలయంలో పని చేస్తోన్న కొందరు ఉద్యోగులు మార్క్ జుకర్ ‌బర్గ్ ‌పై తిరుగుబాటు లేవనెత్తారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించడానికి ఫేస్ ‌బుక్ యాజమాన్యం ఎలాంటి చర్యలను తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మార్క్ జుకర్ ‌బర్గ్ ‌ను నిలదీస్తున్నారు ఆందోళలనలను చేపట్టిన నల్లజాతీయులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను నియంత్రించాలనేది ఫేస్‌బుక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్.

ప్రదర్శనకారులను రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తితే.. అది మరిన్ని దాడులకు ప్రేరేపించడానికి కారణమౌతుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ డిజైన్ డైరెక్టర్ డేవిడ్ గిల్లీస్ అన్నారు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై ట్విట్టర్ తీసుకున్న చర్యలను చేపట్టాలని తాను మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగి కూడా కోరుకుంటున్నారని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జేసన్ టఫ్ తెలిపారు. ఈ నిరసనకారుల ప్రదర్శనల వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించాయి.