Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో జాబ్ అంత కష్టమా?

By:  Tupaki Desk   |   21 May 2016 4:09 AM GMT
ఫేస్ బుక్ లో జాబ్ అంత కష్టమా?
X
జాబ్ చేయటానికి ప్రపంచంలోని అత్యుత్తమ పది కంపెనీలు చెప్పమంటే.. వెనుకా ముందు లేకుండా చెప్పే పేర్లలో ఒకటి ఫేస్ బుక్. ఆ కంపెనీలో కానీ జాబ్ వస్తే చాలు ఇక.. తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తుంటారు. కోట్లాదిమంది డ్రీం కంపెనీ అయిన ఫేస్ బుక్ గురించి షాకింగ్ విషయాల్ని చెప్పుకొచ్చారు ఆ కంపెనీ మాజీ ఉద్యోగిని ఒకరు.

ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆమె చెప్పిన విషయాలు విస్మయం కలిగించటమే కాదు.. చాలా ఆపీసుల్లో ఉండే చాలా దరిద్రాలు ఫేస్ బుక్ ఆఫీసులో కూడా ఉన్నాయా? అని అనిపించక మానదు. ట్రెండింగ్ టీమ్ లో పని చేసిన సదరు మహిళా ఉద్యోగిని చెప్పిన దాని ప్రకారం.. ఆమె పని చేసిన ఈ విభాగంలో 40 నుంచి 50 మంది ఉంటే.. గడిచిన రెండేళ్లలో పదిహేను మంది రిజైన్ చేసి వెళ్లిపోయారని. ఇలా వారు వెళ్లిపోవటానికి కంపెనీలోని అంతర్గత పరిస్థితులే కారణంగా చెప్పుకొచ్చారు. అయితే.. రాజకీయాలు కనిపించవని.. సోషల్ మీడియాలో ముఖ్యమైన ట్విట్టర్ ను వాడకుండా ఉండేలా ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారట.

ఫేస్ బుక్ కంపెనీలో ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులుగా ఆమె చెప్పిన అంశాల్ని చూస్తే..

= కోపం.. నిరుత్సాహం కలిగించే వాతావరణం

= మాట్లాడలేని విధంగా ఆఫీసు ఉండటం

= భయం కలిగించే పరిస్థితులు..

= పక్షపాతం.. లింగ వివక్ష ఎక్కువగా ఉండటం

= మగాళ్లకు ప్రోత్సాహం.. మహిళలకు నిరుత్సాహకరంగా వ్యవహరించటం

= మగాళ్లు మాట్లాడేందుకు తక్కువ అవకాశం ఇవ్వటం

= మగాళ్లు మాట్లాడే సమయంలో నోరు మూసుకొని వినాలే తప్పించి మాట్లాడలేకపోవటం

= మహిళా ఉద్యోగిణులకు సీనియర్ల నుంచి వేధింపులు