Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్.. హైదరాబాద్ మహిళను 1.5 కోట్లు ముంచిన మోసగాళ్లు

By:  Tupaki Desk   |   31 Dec 2022 1:30 AM GMT
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్.. హైదరాబాద్ మహిళను 1.5 కోట్లు ముంచిన మోసగాళ్లు
X
మోసగాళ్లు తెలివి మీరిపోతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పాత తరహాలో అందరూ తెలివిమీరడంతో నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళతో ఫేస్ బుక్ లో చాటింగ్ చేసి ఏకంగా 1.22 కోట్ల రూపాయలను దండుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ పంపిన సైబర్ నేరగాళ్లు ఓ మహిళను నిండా ముంచారు. హైదరాబాద్ కు చెందిన 55 ఏళ్ల మహిళతో ఫ్రెండ్ షిప్ పేరుతో ఛాటింగ్ చేశారు. స్నేహానికి గుర్తుగా లండన్ నుంచి గిఫ్ట్ పంపిస్తున్నట్టుగా నమ్మించారు.

అనంతరం ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ట్యాక్స్ పేరుతో దశల వారీగా 1.22 కోట్లను వసూలు చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించిన మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

ఈ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో స్నేహితుడి అభ్యర్థనను పంపారు. వారు ఆమెకు నిరంతరం మెసేజ్‌లు పంపుతూనే ఉన్నారు. కొంత సమయం తర్వాత సైబర్ మోసం చేసే బృందం బుట్టలోకి దించి ఈ మోసానికి పాల్పడింది. మహిళ క్రమంగా కొంత డబ్బును డిపాజిట్ చేస్తూనే ఉంది. ఆమె మొత్తం రూ. 1.5 కోట్లకు పైగా ఇచ్చింది. తప్పు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.

అయితే నైజీరియన్ సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీయుల నుంచి తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు రావని.. అలా రిక్వెస్ట్ లు వస్తే నైజీరియా సైబర్ గ్యాంగ్ నుంచి అని గ్రహించాలని పోలీసులు సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.