Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ ఫస్ట్ ఇండియన్ ఎంప్లాయీ రాజీనామా
By: Tupaki Desk | 14 Feb 2016 10:20 AM GMT కీర్తిక రెడ్డి... నిన్నమొన్నటి వరకు ఇండియాలో ఫేస్ బుక్ చీఫ్ ఆమె. కానీ, ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ను ఇండియాలో అమలు చేయడాన్ని ట్రాయ్ వ్యతిరేకించిన తరువాత ఒక్కసారిగా సీను మారిపోయింది. ఆమెను ఫేస్ బుక్ ఇండియా బాధ్యతలనుంచి తప్పించి ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేశారు. తాజాగా ఆమె రాజీనామా చేశారు. కీర్తిక రెడ్డి కేవలం ఫేస్ బుక్ ఇండియా చీఫ్ గా మాత్రమే ప్రత్యేకం కాదు... ఫేస్ బుక్ సంస్థలో చేరిన మొట్టమొదటి భారతీయ ఉద్యోగి ఆమె. జులై 2010లో ఆమె ఫేస్ బుక్ లో చేరారు. తాజాగా ఆమె ఫేస్ బుక్ లో ఇక కొనసాగలేనంటూ తన రాజీనామా పత్రాన్ని జుకర్ బర్గ్ కు పంపించారు.
ఫేస్ బుక్ ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఫ్రీ బేసిక్స్ విషయంలో అభాసు పాలవడం.. అనంతరం సంస్థ డైరెక్టర్ ఇండియాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానిపై ఇండియన్ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. దీంతో జుకర్ బర్గ్ నష్ట నివారణకు దిగినా ఈలోగా కీర్తిక రాజీనామా మరింత సంచలనంగా మారింది.
కాగా కీర్తిక రాజీనామా విషయంలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. ట్రాయ్ నిర్ణయం విన్న వెంటనే తనను ఇండియా బాధ్యతల నుంచి తప్పించడంతో ఆమె తీవ్రంగా ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. స్టాన్ ఫర్ట్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె ఫేస్ బుక్ హైదరాబాద్ కార్యాలయంలో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. మూడేళ్ల కిందట వరకు ఆపరేషన్స్ డైరెక్టరుగా ఉన్న ఆమె మూడేళ్ల కిందట నుంచి ఎండీ పోస్టులో ఉన్నారు.
కీర్తిక ఎండీగా బాధ్యతలు చేపట్టే నాటికి ఫేస్ బుక్ కు ఇండియాలో 80 లక్షల యూజర్లే ఉన్నారు. కానీ ఈ మూడేళ్లలో ఆ సంఖ్య 13.8 కోట్లకు చేరింది. అమెరికా తరువాత ఫేస్ బుక్ కు అతిపెద్ద మార్కెట్ ఇండియానే. ఇండియాలో ఫేస్ బుక్ ఆ స్థాయిలో ఆదరణ పొందడం వెనుక కీర్తిక కృషి ఉంది. ఇలాంటి సమయంలో ఆమె రాజీనామా చేయడం ఫేస్ బుక్ కు నష్టమేనని తెలుస్తోంది.
కాగా... కీర్తిక ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆమె వేరే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చేరుతారా...? లేదంటే సొంతంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేస్తారా అన్న చర్చలు సాగుతున్నాయి. కీర్తిక ఆ రెండింట్లో ఏ పనిచేసినా కూడా అది ఫేస్ బుక్ కు పెద్ద దెబ్బే కానుంది.