Begin typing your search above and press return to search.

ఈ ఉద‌యం ఫేస్‌ బుక్ ఆగిపోయింది

By:  Tupaki Desk   |   9 May 2017 7:58 AM GMT
ఈ ఉద‌యం ఫేస్‌ బుక్ ఆగిపోయింది
X
మ‌నిషి జీవితంలో భాగ‌మైపోయాయి సోష‌ల్ నెట్ వ‌ర్క్స్‌. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే బ్ర‌ష్ చేయ‌టం ఎంత మామూలో.. సెల్ ఫోన్లో స్టేట‌స్ చూసుకోవ‌టం.. పోస్టులు చెక్ చేసుకోవ‌టం అంతే మామూలైన ప‌రిస్థితి. ఇది అంత‌కంత‌కూ పెరుగుతూ.. ఫేస్ బుక్ లేకుండా పూట గ‌డ‌వ‌ని ప‌రిస్థితికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లోని కోట్లాది మంది వ‌చ్చేశారు. మ‌రింత‌గా ఆధార‌ప‌డిపోయిన ఫేస్ బుక్ త‌న సేవ‌ల్ని ఆపేస్తే? ఇంకేమైనా ఉందా? కొంప కొల్లేరు కాదు?

మొన్న‌నే వాట్సాప్ సేవ‌ల్లో కాస్త తేడా వ‌చ్చి నిలిచిపోవటంతో ఆగ‌మాగం అయ్యారు. ఇవాల్టి రోజున కూడా అలాంటి ప‌రిస్థితే కోట్లాదిమందికి ఎదురైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లోని ఫేస్ బుక్ కు అంత‌రాయం చోటు చేసుకుంది. కాసేపు ఎఫ్‌బీ సేవ‌లు నిలిచిపోవ‌టంతో భారీ షాక్‌కు గుర‌య్యారు. ఇక‌.. ఫేస్ బుక్‌తోనే అనుక్ష‌ణం మ‌మేకం అయ్యే వారి సంగ‌తి అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారికి.. గుండె ఆగినంత ప‌నైంది.

భార‌త్ తో స‌హా.. ఆసియా.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌.. ఉత్త‌ర అమెరికాలో ప‌లు ప్రాంతంల్లోనూ ఫేస్ బుక్ కి అంత‌రాయం ఎదురైంది. ఫేస్ బుక్ లోకి లాగిన్ కావ‌టానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఎక్క‌డో తేడా జ‌రిగింద‌ని.. వీలైనంత త్వ‌ర‌గా తామీ ఇష్యూను ప‌రిష్క‌రిస్తామ‌ని పేర్కొంది. పొద్దు పొద్దునే ఇలాంటి మెసేజ్ ఫేస్ బుక్ నుంచి ఎదురు కావ‌టంతో కోట్ల‌మంది తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అయితే.. ఈ ఇష్యూను ఫేస్ బుక్ త్వ‌ర‌గానే సెట్ చేయ‌టంతో ఎఫ్ బీ ప్రియులంతా ఊపిరిపీల్చుకున్నార‌ని చెప్పాలి. జ‌రిగిన అసౌక‌ర్యానికి త‌మ‌ను క్ష‌మించాల‌ని కోరింది.