Begin typing your search above and press return to search.

ఏడాదికి రూ.66 జీతగాడి సెక్యూరిటీకి 84 కోట్లు

By:  Tupaki Desk   |   30 April 2016 11:43 AM GMT
ఏడాదికి రూ.66 జీతగాడి సెక్యూరిటీకి 84 కోట్లు
X
ఒక వ్యక్తి జీతం ఏడాదికి అక్షరాల రూ.66 మాత్రమే. కానీ.. అతగాడి భద్రత కోసం గత మూడేళ్లుగా ఆ కంపెనీ చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.84కోట్లు. నమ్మశక్యంగా అనిపించదు కానీ ఇదినిజం. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు సంబంధించి లెక్క ఇది. ఆయన ఏడాదికి రూ.66 మాత్రమే జీతం తీసుకున్నారు. కానీ.. ఆయన భద్రత కోసం భారీ మొత్తాన్ని ఫేస్ బుక్ ఖర్చు చేస్తోంది.

ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఆయన్ను అనునిత్యం కంటికి రెప్పలా చూసుకునేందుకు ఫేస్ బుక్ కు భారీ వ్యయమే అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా సెక్యూరిటీ ఏర్పాట్లు చూసినట్లే సీక్రెట్ సర్వీసెస్ సంస్థ మార్క్ జుకర్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జుకర్ భద్రత కోసం.. ఆయన మాదిరే అత్యంత ప్రముఖులైన అమెజాన్.. యాపిల్ సంస్థల సీఈవోల కంటే ఫేస్ బుక్ సీఈవో భద్రత కోసం భారీగా వెచ్చిస్తున్నారు. ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన జుకర్ ప్రాణాల్ని రక్షించుకునేందుకు అత్యాధునిక భద్రతా ప్రమాణాల్ని ఫేస్ బుక్ పాటిస్తోంది.

2013లో జుకర్ భద్రత కోసం రూ.17.06 కోట్లు ఖర్చు చేయగా.. 2014లో ఇది కాస్తా రూ.37.19 కోట్లకు చేరుకుంది. 2015లో జుకర్ భద్రత కోస రూ.30.55 కోట్లను ఖర్చు చేయటం గమనార్హం. ఫేస్ బుక్ కు ఊపిరి లాంటి జుకర్ ప్రాణం ఎంత విలువైందో ఫేస్ బుక్ కు మించి మరెవరికి తెలుస్తుంది.