Begin typing your search above and press return to search.
వైరల్ మాటతో ఫేస్ బుక్ నష్టం జస్ట్..8.92లక్షల కోట్లు!
By: Tupaki Desk | 26 July 2018 10:00 AM GMTవైరల్ అయ్యే మాట శాంతిభద్రతల సమస్యే కాదు.. వ్యక్తుల జీవితాల్ని.. వారి పేరు ప్రఖ్యాతుల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి.. ప్రపంచంలో ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావాన్ని రూపాయిల్లో లెక్క కట్టింది లేదు. కానీ.. అలాంటి వైరల్ మాట.. తాజాగా ఫేస్ బుక్ కు చుక్కలు చూపించటమే కాదు.. భారీగా సంపద కరిగిపోయేలా చేసింది.
ఆ మధ్యన కేంబ్రిడ్జి అనలిటికా పుణ్యమా అని ఫేస్ బుక్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ కావటం తెలిసిందే. దీనిపై స్పందించిన జుకర్.. స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. కేంబ్రిడ్జి అనలిటికా కారణంగా కంపెనీ ఆదాయం భారీగా పడిపోతుందన్న ఆందోళనలు వైరల్ గా మారటంతో.. తాజాగా ఆ షేర్ భారీ కుదుపునకు లోనైంది.
రికార్డు స్థాయిలో 21 శాతం మేర ఫేస్ బుక్ షేర్ వాల్యూ పడిపోయింది. డేటా దుర్వినియోగం.. వాటికి సంబంధించిన దర్యాఫ్తుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆందోళనతో ట్రేడింగ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఫేస్ బుక్ షేర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి.
గంటల వ్యవధిలో 21 శాతం పడిపోయిన ఫేస్ బుక్ షేర్లతో ఆ కంపెనీకి చెందిన రూ.8.92 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆదాయం.. వినియోగదారుల వృద్ధి పడిపోయిందన్న మాటతో ఆదాయం తగ్గింది. అంచనాలకంటే తక్కువగా ఉన్న ఫలితాలతో ఫేస్ బుక్ షేర్లు కుప్పకూలాయి. రానున్న త్రైమాసికంలో బలహీనమైన ఆదాయం ఉంటుందన్న అంచనాలే దీనికి కారణంగా చెబుతున్నారు.