Begin typing your search above and press return to search.
ఎఫ్ బీ లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసింది!
By: Tupaki Desk | 6 Dec 2015 5:30 PM GMTప్రపంచంలో ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా వందల కోట్ల మంది ఉపయోగించే సోషల్ నెట్ వర్క్ సైట్లలో ఒకటి ఫేస్ బుక్. నిత్యం తనదైన మార్క్ తో సరికొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ.. ప్రత్యర్థులెవరూ సమీపంలోకి రావటానికి కూడా సాధ్యం కాని రీతిలో సరికొత్త పీచర్లను అందుబాటులోకి తేవటం తెలిసిందే.
ఇప్పటివరకూ సెలబ్రిటీలకు.. వెరిఫైడ్ అకౌంట్లకు మాత్రమే అందుబాటులో ఉన్న లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్.. ఇప్పుడు పరిమితంగా యూఎస్ లోని యాపిల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొ్చ్చింది. తాజా ఫీచర్ తో లైవ్ వీడియోలను అకౌంట్ లోని సభ్యులు చూసుకునే వీలు ఉంటుంది. కావాలంటే.. వీటిని ఓపెన్ గా కూడా ఉంచుకునే అవకాశం ఉంది.
ఇక.. లైవ్ స్ట్రీమింగ్ ను చూసుకోవటంతోనే.. ఇది ఎవరికి వారి అకౌంట్లోఈ వీడియో సేవ్ కావటం మరో అదనపు సౌకర్యంగా చెప్పొచ్చు. తాజా ఫీచర్ తో కళ్ల ముందే జరిగే ప్రతి అంశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకునే అవకాశం కలుగుతుంది. అదేసమయంలో తాము లైవ్ స్ట్రీమ్ చేసే వీడియోను ఎంతమంది చూస్తున్నారన్న విషయం కూడా డిస్ ప్లే అవుతుంది. లైవ్‌స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన వెంటనే.. ఆ విషయం పుష్ నోటిఫికేషన్ రూపంలో స్నేహితులకు తెలిసే వీలుంది.
ప్రస్తుతం అమెరికాలోని యాపిల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. రానున్న రోజుల్లో ఫేస్‌బుక్ వినియోగదారులందరికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. పెరిస్కోప్.. మీర్‌కట్ లతో ట్విట్టర్ లైవ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ క ధీటుగా ఫేస్ బుక్ లైవ్ విషయంలో తాను తక్కువ తినలేదని చెప్పినట్లు అయ్యింది. అయితే.. ఈ ఫీచర్ తో పైరసీ ఇష్యూలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి..ఈ ఇబ్బందిని ఫేస్ బుక్ ఎలా పరిష్కరించుకుంటుందో మరి..?