Begin typing your search above and press return to search.

ఆర్ ఎఫ్ సి కి ర్యాంకింగ్ ఇచ్చిన ఫేస్ బుక్

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:30 AM GMT
ఆర్ ఎఫ్ సి కి ర్యాంకింగ్ ఇచ్చిన ఫేస్ బుక్
X
ఫేస్ బుక్ అంటే వ్యక్తిగత ఖాతాలే కాదు... ప్రత్యేక పేజీలు కూడా. అది వ్యక్తులు కావొచ్చు, ప్రాంతాలు కావొచ్చు, అంశాలు కావొచ్చు.. ఏదైనా సరే ప్రత్యేక పేజీలు క్రియేట్ దానికి సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. దేనిగురించైనా సమాచారం కావాల్సిన వారు, అప్ డేట్స్ తెలుసుకోవాలనుకునేవారు ఆ పేజీలపై ఆధారపడుతుంటారు. సాధారణంగా ఆయా వ్యక్తులు - సంస్థలు - ప్రాంతాలకు సంబంధించినవారు ఈ పేజీలు క్రియేట్ చేస్తుంటారు. పద్ధతేదైనా కానీ ఫేస్ బుక్ లోనూ నెటిజన్లు అనేక అంశాల కోసం వెతుకుతున్నారు. ఇలా ఇండియాలో అత్యధికంగా ఏఏ ప్రాంతాలు - పర్యాటక అంశాల కోసం నెటిజన్లు వెతికారన్న వివరాలతో టాప్ టెన్ జాబితాను ఫేస్ బుక్ విడుదల చేసింది. అందులో తెలంగాణలోని రామోజీ ఫిలింసిటీకి చోటు దక్కింది. టాప్ టెన్ జాబితాలో రామోజీ ఫిలింసిటీ 9వ స్థానంలో నిలిచింది.

దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న రామోజీ ఫిలింసిటీకి సందర్శులు ఎక్కువగా వస్తుంటారు. అలాంటివారంతా దీనికి సంబంధించిన చిత్రాలు, సమాచారం కోసం ఫేస్ బుక్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆ ఫలితంగా రామోజీ ఫిలింసిటీ టాప్ టెన్ లో లిస్టయ్యింది.

ఎఫ్బీ టాప్ టెన్ ప్లేస్ లు ఇవీ..

1. ఇండియాగేట్

2. తాజ్ మహాల్

3. ముంబై మెరైన్ డ్రైవ్

4. నంది కొండలు

5. గేట్ వే ఆఫ్ ఇండియా

6. హర్ కీ పౌరీ(హరిద్వార్)

7. కుతుబ్ మీనార్

8. ముస్సోరీ

9. రామోజీ ఫిలింసిటీ

10.అమృత్ సర్ స్వర్ణ దేవాలయం