Begin typing your search above and press return to search.

మైండ్ రీడింగ్ ప్రాజెక్ట్.. ఫేస్ బుక్ కలకలం

By:  Tupaki Desk   |   28 Sep 2019 10:23 AM GMT
మైండ్ రీడింగ్ ప్రాజెక్ట్.. ఫేస్ బుక్ కలకలం
X
స్మార్ ఫోన్.. అందులో గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి చాలా యాప్స్.. ఇప్పటికే మన వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్ లకు సోషల్ మీడియాకు చేరిపోతోంది. మన వ్యక్తిగత అభిరుచులు కూడా వాటికి తెలిసి ఆ మేరకు మనకు అలాంటి యాడ్సే వస్తున్నాయన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

అయితే ఇప్పుడు మనిషి ఆలోచనల ఆధారంగా పనిచేసే ‘కంట్రోల్ ల్యాబ్స్’ అనే కొత్త డివైజెస్ ఒకటి కనుగొన్నారు. మన ఆలోచనల ఆధారంగా ఆ డివైజ్ పనిచేస్తుంది. ఈ డివైజ్ ను కోట్లు పెట్టి తాజాగా ఫేస్ బుక్ యాజమాన్యం తాజాగా కొనుగోలు చేసింది.

ఇప్పటికే ఫేస్ బుక్ మనుషుల ఆలోచనల ఆధారంగా పనిచేసే స్టార్టప్ ల తయారీకి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన తొలి డివైజ్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. ఈ మైండ్ రీడింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

మనుషుల వ్యక్తిగత - విలువైన సమాచారం మన ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది.ఇప్పుడు ఫేస్ బుక్ కనుక ఈ డివైజ్ ను అమల్లోకి తెస్తే మన ఆలోచనలు - వ్యక్తిగత అభిరుచులు మనస్తత్వం అంతా గోప్యత ఫేస్ బుక్ పరమవుతుంది. అందుకే ఇప్పుడు ఫేస్ బుక్ కొనుగోలు చేసిన ‘కంట్రోల్ ల్యాబ్స్’ అనే మైండ్ రీడింగ్ డివైజ్ పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.