Begin typing your search above and press return to search.

కంటెంట్ క్రియేటర్లకు ఫేస్ బుక్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   27 Aug 2020 2:30 AM GMT
కంటెంట్ క్రియేటర్లకు ఫేస్ బుక్ గుడ్ న్యూస్
X
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రచురుణకర్తలకు గుడ్ న్యూస్ తెలిపింది. పలు దేశాల్లో ఫేస్ బుక్ న్యూస్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. కంటెంట్ కు తగిన పారితోషికం చెల్లించనున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వినియోగదారులతో ఫేస్ బుక్ అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఇప్పటికే వార్త సేవల్ని ప్రారంభించింది. ఇప్పుడు యూరప్ లోని యూకే, జర్మనీ, ఫ్రాన్స్, భారత్, బ్రెజిల్ తదితర దేశాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 6 నెలల్లోనే ఈ మేరకు విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే కంటెంట్ క్రియేటర్స్, పబ్లిషర్స్ కు డబ్బు చెల్లించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కంటెంట్ క్రియేట్ చేసి సరికొత్త బిజినెస్ మోడల్ తో ముందుకు సాగనున్నట్లు సమాచారం. న్యూస్ ఇండస్ట్రీకి ఊతమిచ్చేలా ఉపాధి కల్పించేలా ఫేస్ బుక్ తీసుకున్న నిర్ణయంపై కంటెంట్ రైటర్లు హర్షం వ్యక్తం చేస్తోంది.