Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్ కార్యాల‌యంపై దాడి

By:  Tupaki Desk   |   14 Dec 2015 6:46 AM GMT
ఫేస్‌ బుక్ కార్యాల‌యంపై దాడి
X
సోష‌ల్ మీడియాలో తిరుగులేని ఆధిప‌త్యంతో ముందుకు దూసుకెళుతున్న ఫేస్‌ బుక్ కార్యాల‌యంపై గుర్తు తెలియ‌ని దండుగులు దాడి చేశారు. జర్మనీలో హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయంపై 20 మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. దాడి చేసిన వ్య‌క్తులు ముసుగులు ధ‌రించి..బ్లాక్ డ్రెస్‌ లు ధరించి లోప‌ల‌కు చొర‌బ‌డిన‌ట్టు హాంబ‌ర్గ్ పోలీసులు చెపుతున్నారు. ఫేస్‌ బుక్ కార్యాల‌యంపై దాడి చేసిన అనంత‌రం వారు ఫేస్‌ బుక్ లోప‌ల‌కు ప్ర‌వేశించే ప్ర‌వేశ‌ద్వారం వ‌ద్ద 'ఫేస్ బుక్ డిజ్ లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది.

ఈ ఘ‌ట‌న‌పై అటు ఫేస్‌ బుక్ యాజ‌మాన్యంతో పాటు జ‌ర్మ‌నీ నాయ‌కులు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఈ ప‌రిస్థితులు తెలెత్తాయ‌ని జ‌ర్మ‌నీలోని వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌తో పాటు ప‌లు సామాజిక సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు చెపుతున్నారు. ఇటు ఫేస్‌ బుక్ యాజ‌మాన్యం కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించింది.

ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్ బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్ బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న స‌మ‌యంలోనే ఫేస్‌ బుక్ కార్యాల‌యంపై దాడి జ‌రిగింది.