Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి షాకిచ్చిన గులాబీనేత
By: Tupaki Desk | 15 Oct 2018 4:45 AM GMTకీలకమైన ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో వంద సీట్లు ఖాయంగా గెలుచుకుంటామని గులాబీ నేతలు చెబుతుంటే.. గులాబీ అధినేత మాత్రం వంద కాదు.. నూట పది అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పవర్ తమ చేతుల్లో ఉంటుందని ఎంత నమ్మకంగా చెబుతున్నా.. టీఆర్ఎస్ పార్టీకి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
తాజాగా నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ కమ్ టీఆర్ఎస్ నేత అప్పాల గణేశ్ చక్రవర్తి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనే కాదు.. ఆయనతో పాటు 17 మంది కౌన్సిలర్లు.. కో ఆప్షన్ సభ్యుడు.. మరో ఇద్దరు మజ్లిస్ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు.. వారంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమ రాజీనామా లేఖను ఫ్యాక్స్ రూపంలో పార్టీకి పంపిన ఈ నేతల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో తానెందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తన రాజీనామాకు తాజా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగా ఆయన చెప్పారు. ఇంతకీ కీలకమైన ఎన్నికల వేళ.. నిర్మల్ సర్పంచ్ పదవికి తానెందుకు రాజీనామా చేసిందన్న విషయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు.
ఆయన పెట్టిన పోస్ట్ లో కీలకమైన వ్యాఖ్యల్ని చూస్తే.. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయటం వెనుక తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లో ఉన్న ముఖ్యాంశాల్ని చూస్తే..
" గృహ నిర్మాణ - న్యాయ - దేవదాయశాఖ మంత్రి కాగానే పట్టణంలోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని హామీ ఇచ్చాము. తద్వారా నిర్మల్ పట్టణంలో ఇల్లులేని నిరుపేదలకు ఇంటి కళ నెరవేరుతుందని ఆశించాం.. ఇది కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది.
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కింద ఇండ్లను రూ. 1.5లక్షల సబ్సిడీతో పక్కరాష్ట్రమైన ఏపీలో 4లక్షల ఇళ్లు మంజూరు కావడం జరిగింది. కానీ మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మంజూరుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో ఒక ఇళ్లు కూడా కట్టించుకోలేకపోయారు. ఈ విషయమై ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చి మీ శాఖయైన గృహ నిర్మాణ శాఖ చొరవ తీసుకోవాలని కోరాను. కానీ మీరు మాత్రం పట్టించుకోలేదు.
గత ముప్పై సంవత్సరాల నుంచి బడుగు, బలహీన వర్గాల నుంచి వస్తున్న నాయకత్వాన్ని ఎదగనీయకుండా గ్రూపులుగా విభజించి బలహీన పరుస్తున్నారు. అదే విధమైన వైఖరి నా పట్ల కూడా ప్రదర్శించడం వల్ల మానసికంగా వేదన చెందాను.
మీరు చేస్తున్న ఈ ప్రక్రియను ఆపమని గతంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా వేడుకున్నాము. ఇదే మీ కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు కూడా తెలియపరిచాను. బలహీన వర్గాల నాయకులు మీ దగ్గర ఎదగలేరని భావించి మీ వైఖరికి, పార్టీ వైఖరికీ నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను.
నన్ను వెన్నంటి ఉంటే అనుచరులు, అభిమానుల కోరిక మేరకు పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను"