Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్‌ సీఈఓగా జుక‌ర్‌ ను తొల‌గించండి!!

By:  Tupaki Desk   |   10 Feb 2017 9:04 AM GMT
ఫేస్‌ బుక్‌ సీఈఓగా జుక‌ర్‌ ను తొల‌గించండి!!
X
ఫేస్‌ బుక్‌ తో ప్ర‌పంచంలోని ఎక్క‌డెక్క‌డి వారినో ఒక్క వేదిక‌పైకి తీసుకు వ‌చ్చిన ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్ వ్య‌వస్థాపకుడు - సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న కంపెనీ షేర్‌ హోల్డర్లు కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. జుక‌ర్ బ‌ర్గ్ ను సీఈఓ స్థానంలో తొలగించాలని పట్టుబడుతున్నారు. జుకర్‌ బర్గ్‌ ను తొలగించి ఆయన స్థానంలో కొత్త సీఈవోని నియమించాలని 3,33,000 మంది పిటిషన్‌ వేసినట్టు వెంచర్‌ బీట్‌ పేర్కొంది. నకిలీ సమాచారానికి ఫేస్‌బుక్‌ వేదికగా మారుతోందని, ఇది ఫేస్‌ బుక్ విశ్వ‌స‌నీయ‌త‌కు దెబ్బ అని వారు వాదిస్తూ ఈ కొత్త డిమాండ్ తెచ్చారు.

కాగా ఈ పిటిషన్‌ ఫేస్‌ బుక్‌ పై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలుస్తోంది విశ్లేష‌కులు అంటున్నారు. ఫేస్ బుక్ లో ఎక్కువ వాటాలు జుకర్‌బర్గ్‌కే ఉన్నాయని, ఆయ‌న్ను తొల‌గించాలంటూ పిటిషన్‌ వేసిన షేర్‌ హోల్డర్ల సంఖ్య కేవలం 1500 మాత్రమేన‌ని చెప్తున్నారు. త‌ద్వారా జూకర్‌ బర్గ్ ప‌ద‌వీ మార్పుపై ఈ పిటిషన్‌ ప్రభావం చూపించబోదనేది నిపుణుల అభిప్రాయం. కాగా 2012 నుంచి ఫేస్‌ బుక్‌ కు సీఈవో మరియు బోర్డ్‌ ఛైర్మన్‌ బాధ్యతలు జుకర్‌ బర్గ్ నిర్వహిస్తున్నారు. ప్ర‌ముఖ ప‌త్రిక‌ ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో జుక‌ర్ బ‌ర్గ్ గ‌త ఏడాది ప‌దో స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఫేస్‌ బుక్ ద్వారా సంపాదించిన పాపులారిటీతో రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఐటీ కంపెనీలకు స్వ‌ర్గ‌దామ‌మైన సిలికాన్ వ్యాలీ నుంచి త‌న ప్ర‌యాణాన్ని మొద‌లుపెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే 1,500 గృహ స‌ముదాయాల‌కు జుక‌ర్ బ‌ర్గ్ శ్రీ‌కారం చుట్టారని, ఈ ఇళ్ల‌లో 10-15% ఇళ్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి చెందేలా జుక‌ర్‌ బ‌ర్గ్ ప్ర‌ణాళిక‌లు రచించారని వార్త‌లు వ‌చ్చాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/