Begin typing your search above and press return to search.
తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్ బుక్.. ఏమైందంటే?
By: Tupaki Desk | 17 Aug 2021 3:30 PM GMTఆఫ్ఘనిస్థాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు. ఆ దేశ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకుని, వరుసగా అన్ని ప్రభుత్వ సముదాయాలపై జెండా పాతేస్తున్నారు. ఇక, ఎప్పటికప్పుడు తాలిబన్ల మూమెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సమాచారం సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్పష్టం చేసింది.
తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం విధించినట్టు ప్రకటించింది పేస్ బుక్, ఇప్పటికే తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది. అయితే, దీనికి ప్రధానం కారణం, అమెరికా ప్రభుత్వం తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొనడమే అంటోంది ఫేస్ బుక్. ఇక పై తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై ఓ కన్నేసి ఉంచుతామని, దానికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది ఫేస్ బుక్, ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులను ఆ స్పెషల్ టీమ్ లో సభ్యులుగా చేర్చింది.
స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు,. ఫేస్ బుక్ లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ సంస్థను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. మొత్తంగా తాలిబన్లకు సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని కూడా ఫేస్ బుక్ వేదికగా పంచుకునే వీలులేకుండా చర్యలకు పూనుకుంది. గత కొన్నేళ్లుగా తాలిబన్ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకుంటుంది. తాలిబన్ల సందేశాలను నిర్మూలించడం కోసం ఫేస్ బుక్ ప్రత్యేకంగా స్థానిక దరి పెర్షియన్, పష్తో భాషలను మాట్లాడే అఫ్గాన్ నిపుణులను నియమించినట్లు ఫేసుబుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. తాలిబన్లు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వాట్సాప్ యాప్ వాడుతున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ లో సర్క్యూలేట్ అయ్యే మెసేజ్ లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఫేస్ బుక్ పేర్కొంది.