Begin typing your search above and press return to search.
సూసైడ్ లకు ఫేస్ బుక్ అడ్డుకట్ట
By: Tupaki Desk | 6 Sep 2016 7:53 AM GMTక్షణం తీరికదొరికితే ఫేస్ బుక్ లో చాటింగ్ లతో బిజీ అయిపోతాం. మన మనసులోని భావాల్ని అందరితోనూ పంచేసుకుంటాం. మన ఫొటోలను - అభిప్రాయాలను ప్రపంచంతో షేర్ చేసేసుకుంటాం. ఇప్పటి వరకు ఫేస్ బుక్ రోల్ ఇంతేనని మనకు తెలుసు! కానీ.. ఇటీవలే ఫేస్ బుక్ ఆత్మహత్యలపై స్పందించింది. చిన్న చిన్న కారణాలతో జీవితాలను అర్ధంతరంగా ముగించేస్తున్న వారికి మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు కొన్ని టూల్స్ ను కూడా ప్రవేశ పెట్టింది. అయినా.. కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో మరింత కృషి చేసైనా ఆత్మహత్యలకు చెక్ పెట్టాలని ఫేస్ బుక్ డిసైడైంది.
జీవితం ఎంతో పెద్దదని - దానిలో వచ్చే చిన్న చిన్న సమస్యలు స్పీడ్ బ్రేకర్ల వంటి వాటివని వాటిని తట్టుకుని నిలబడినప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుందని ఫేస్ బుక్ మెసేజ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. క్షణికావేశాన్ని చల్లార్చి జీవితంపై ఆశలు పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చారిటీ సంస్థ సామరిటన్స్ తో కలిసి సూసైడల్ ఎమోషన్స్ తో స్నేహితులు - యూజర్ల ఫ్లాగ్ పోస్టుపై చేసే పోస్టులపై ఆధారపడి ఫేస్ బుక్ ఈ ఆత్మహత్యల నివారణకు కృషి చేయనుంది. హెల్ప్ ఆప్షన్ బటన్ తో ఫేస్ బుక్ మోడరేటర్లను ఆశ్రయించినవారిని గుర్తించి, వారికి సామరిటన్స్ తో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించనుంది.
సామరిటన్స్ వాలంటరీలను ఎలా కలవాలో కూడా టూల్స్ సహకరించకేందుకు ఓ ఆప్షన్ ను ఫేస్ బుక్ నిర్వర్తిస్తోంది. ఒత్తిడికి గురవుతున్న యూజర్లను గుర్తించి, ఆ భారం నుంచి తప్పించడానికి ఫేస్ బుక్ కృషిచేస్తున్నట్టు కంపెనీ యూరోపియన్ సేఫ్టీ పాలసీ మేనేజర్ జూలీ డి బేలియన్ కోర్టు తెలిపారు. ఈ నెల 10న ఇంటర్నేషనల్ సూసైడ్ డే సందర్భంగా ఈ టూల్ ను ఫేస్ బుక్ లో యాడ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఫేస్ బుక్ ప్రయత్నానికి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. సూసైడ్ లేని ప్రపంచం దిశగా ఫేస్ బుక్ చేస్తున్న కృషి హర్షణీయమని అంటున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.