Begin typing your search above and press return to search.

2098 నాటికి ఫేస్ బుక్ పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   8 March 2016 10:30 PM GMT
2098 నాటికి ఫేస్ బుక్ పరిస్థితేంటి?
X
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ ఏ మాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టంది ఏమైనా ఉందంటే ఫేస్ బుక్ అప్ డేట్ చేసుకోవటం. ప్రపంచంలోని వందల కోట్ల మంది పరిస్థితి ఇదే. గడిచిన వందేళ్లలో ప్రపంచ ప్రజల్ని ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది మరింకేదీ లేదనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అలాంటి ఫేస్ బుక్ ఇప్పటికైతే తిరుగులేదు. మరి.. 2098 నాటికి పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న వేసుకొని.. సమాధానం వెతికితే కాసింత షాక్ తగలటం ఖాయం. నిజానికి అంతదూరం ఆలోచించకపోవటమే ఈ షాక్ కి కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. వందల కోట్ల మంది వినియోగిస్తున్న ఫేస్ బుక్.. 2098 నాటికి (అంటే 82 ఏళ్ల తర్వాత ముచ్చట) ఇప్పుడు బతికి ఉన్న వాళ్లలో దాదాపు ఎవరూ మిగిలి ఉండరు. అంటే.. ఫేస్ బుక్ లో ఇప్పుడున్న వారు మరణిస్తారు.

అంటే.. వారి మరణం తర్వాత ఆ అకౌంట్లు మొత్తం నిర్జీవంగా మారే వీలుంది. ఒకవేళ.. ఎవరైనా సన్నిహితులు.. కుటుంబ సభ్యులకు ఫేస్ బుక్ పాస్ వర్డ్ తెలిస్తే.. అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అలా కాకుండా.. శ్మశానంలో సమాధుల మాదిరి.. ఫేస్ బుక్ అకౌంట్లు మొత్తం నిర్జీవంగా మారతాయి. రానున్న రోజుల్లో ఫేస్ బుక్ వాడే వారు పెరిగితే ఫర్లేదు. లేదంటే.. ఫేస్ బుక్ మొత్తం సమాధుల కిందనే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫేస్ బుక్ లో అకౌంట్లు ఉన్న వారి మరణాల లెక్కలు చూస్తే.. 2010లో 3.85లక్షల మంది మరనిస్తే.. 2012లో 5.8లక్షల మంది మరణించారు. ఈ ఏడాది పూర్తి అయ్యే నాటికి 9.7లక్షల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 2098 నాటి పరిస్థితి లెక్కేస్తే..?