Begin typing your search above and press return to search.
రాజకీయ ప్రకటనకర్తలకు ఫేస్ బుక్ షాక్!
By: Tupaki Desk | 29 Oct 2017 9:24 AM GMTసినిమాలు - రాజకీయాలు - వ్యాపార ప్రకటనలు....ఇలా ఒకటేమిటి అన్ని రకాల అంశాల ప్రమోషన్లకు సోషల్ మీడియా ఓ వేదికైంది. ప్రధాన మీడియాలైన ప్రింట్ - ఎలక్ట్రానిక్ లకు దీటుగా వెబ్ మీడియాకు కూడా రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ - ట్విట్టర్ - యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ప్రకటనల జోరు కూడా పెరిగిపోయింది. సినిమాలకు - వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఎవరిచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే, సోషల్ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు ఇస్తున్నదెవరో తెలుసుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. ఆ ప్రకటనలు ఇస్తున్నవారి పేర్లు బయటకు వచ్చేవి కాదు. అయితే, ఇకపై ఆ ప్రకటనల వెనుక ఉన్న వారి పేర్లను, వివరాలను తెలుసుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పించనుంది. ఆ దిశగా ఫేస్ బుక్ చర్యలు చేపట్టింది.
ఇకపై సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ఇస్తున్న వారి వివరాలను బహిర్గతం చేస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది. ఆ ప్రకటనకర్తల విషయంలో మరింత పారదర్శకంగా ఉంటామని చెప్పింది. ఇకపై పేస్ బుక్ లో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు తమ వివరాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా, ఆ ప్రకటనకు డబ్బులెవరిచ్చారో కూడా ప్రకటనలో స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. ఆ ప్రకటనకర్తల చిరునామా - ప్రాంతం వంటి వివరాలు తప్పనిసరి చేయబోతున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది. ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా 'పెయిడ్ ఫర్ బై' అనే ఆప్షన్ ను ఫేస్ బుక్ కు యాడ్ చేయబోతోంది. ఫేస్ బుక్ లో 'పెయిడ్ ఫర్ బై` ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ ప్రకటన ఇచ్చినవారి పూర్తి వివరాలు తెలుస్తాయి. 2018 నవంబర్ లో కెనడాలో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో 'పెయిడ్ ఫర్ బైసని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయని రష్యాకు చెందిన 'ఆర్ టీ' (రష్యా టుడే), 'స్ఫుత్నిక్' మీడియా సంస్థలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను రష్యా ఖండించింది. రష్యా- ట్రంప్ నకు మధ్య సంబంధాలపై విచారణ సాగుతోంది. రష్యాతో కలిసి ఎలాంటి కుట్ర పన్నలేదని ట్రంప్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటనలు కొనుగోలు చేయకుండా ట్విటర్ ఆ రెండు సంస్థలపై నిషేధం విధించింది. ఆ ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకటనలపై స్వీయ నియంత్రణ పాటించాలని సోషల్ మీడియా దిగ్గజాలు భావిస్తున్నాయి. రాజకీయ ప్రకటనలపై 'లేబుల్' వేయడంతో పాటు - నిధులిచ్చినవారి మరిన్ని వివరాలు పొందుపరిచేలా ఫేస్ బుక్ - ట్విట్టర్ లు చర్యలు చేపట్టనున్నాయి. రాజకీయ ప్రకటనలు పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఫేస్ బుక్ - ఇతర ఇంటర్నెట్ సంస్థలు మంగళవారం అమెరికా సెనెట్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి.