Begin typing your search above and press return to search.

ఆ ఆప్ష‌న్ ను తొల‌గించ‌నున్న ఫేస్ బుక్!

By:  Tupaki Desk   |   3 Jun 2018 2:30 PM GMT
ఆ ఆప్ష‌న్ ను తొల‌గించ‌నున్న ఫేస్ బుక్!
X
నువ్వా ద‌రిని....నేనీ ద‌రిని....ఫేస్ బుక్ క‌లిపింది ఇద్ద‌రినీ....అని చాలామంది పాడుకుంటున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. విరివిగా అందుబాటులోకి వ‌చ్చిన ఇంట‌ర్నెట్ దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తే....ఫేస్ బుక్ మ‌నుషుల మ‌ధ్య స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసింది. వార్త‌లు - విజ్ఞానం - వినోదం - ఇలా ఒక‌టేమిటి....దాదాపుగా మ‌న‌కు కావాల్సిన స‌మాచారం ఫేస్ బుక్ లో ల‌భిస్తోంది. అందుకే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగ‌దారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అనుభూతినిచ్చేందుకు ఫేస్ బుక్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న న్యూస్ ట్రెండింగ్ ఆప్ష‌న్ కు బ‌దులుగా మ‌రో స‌రికొత్త ఆప్ష‌న్ ను అందుబాటులోకి తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది. 2014లో ప్ర‌వేశ‌పెట్టిన ట్రెండింగ్ ఫీచ‌ర్ ను తొల‌గించి ఆ స్థానంలో మ‌రో ఆప్ష‌న్ ను లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ట్విట్ట‌ర్ తో పాటు మ‌రికొన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ ఆప్ష‌న్ బాగా పాపుల‌ర్. అయితే, ఫేస్ బుక్ ట్రెండిగ్ ఆప్ష‌న్ కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేద‌ని తేలింది. దానికి కేవ‌లం 1.5శాతం హిట్స్ మాత్రమే రావ‌డంతో ఆ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఫేస్ బుక్ లో ట్రెండింగ్ ఆప్ష‌న్ ను వ‌చ్చేవారం నుంచి తొల‌గించాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యించింది. దానితో పాటు ట్రెండింగ్ కు సంబంధించిన థ‌ర్డ పార్టీ యాడ్స్ ను కూడా తొల‌గించ‌నుంది. ఆ ఆప్ష‌న్ స్థానంలో మ‌రో స‌రికొత్త ఆప్ష‌న్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. అందుకోసం బ్రేకింగ్ న్యూస్ లేబుల్, టుడే ఇన్, న్యూస్ వీడియో ఇన్ వాచ్ అనే మూడు ఆప్ష‌న్స్ ను ప‌రిశీలిస్తోంది. ఆ మూడు ఆప్ష‌న్స్ ప్ర‌స్తుతం ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి. వాటిలో ఒక దానిని ఎంపిక చేసి ట్రెండింగ్ కు బ‌దులు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. దీంతోపాటు మ‌రికొన్ని కొత్త ఫీచ‌ర్స్ , ఆప్ష‌న్స్ ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఫేస్ బుక్ యాజ‌మాన్యం యోచిస్తోంది. మొబైల్ ట్రెండింగ్ కు సంబంధించిన వీడియోలు, వాటి అప్ డేట్స్ ను ఫేస్ బుక్ యూజ‌ర్లు ఎక్కువ‌గా వీక్షిస్తున్నార‌ని ఫేస్ బుక్ ప‌రిశోధ‌నా విభాగం తేల్చింది. ట్విట్ట‌ర్ తో పాటు మ‌రికొన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ ఆప్ష‌న్ బాగా పాపుల‌ర్. ఫేస్ బుక్ లో ట్రెండింగ్ ఆప్ష‌న్ ను వ‌చ్చేవారం నుంచి తొల‌గించాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యించింది. దానితో పాటు ట్రెండింగ్ కు సంబంధించిన థ‌ర్డ పార్టీ యాడ్స్ ను కూడా తొల‌గించ‌నుంది. ఆ ఆప్ష‌న్ స్థానంలో మ‌రో స‌రికొత్త ఆప్ష‌న్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. అందుకోసం బ్రేకింగ్ న్యూస్ లేబుల్ - టుడే ఇన్ - న్యూస్ వీడియో ఇన్ వాచ్ అనే మూడు ఆప్ష‌న్స్ ను ప‌రిశీలిస్తోంది. ఆ మూడు ఆప్ష‌న్స్ ప్ర‌స్తుతం ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి. వాటిలో ఒక దానిని ఎంపిక చేసి ట్రెండింగ్ కు బ‌దులు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.