Begin typing your search above and press return to search.

స్కార్పియోతో గుద్ది.. క‌త్తుల‌తో పొడిచి చంపేశారు

By:  Tupaki Desk   |   4 Dec 2017 9:18 AM GMT
స్కార్పియోతో గుద్ది.. క‌త్తుల‌తో పొడిచి చంపేశారు
X
ఫ్యాక్ష‌న్ పేరు విన్నంత‌నే రాయ‌ల‌సీమ గుర్తుకు వ‌స్తుంది. సీమ‌లో మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే ప‌గ‌లు.. ప్ర‌తీకారాల‌కు జీవితాల్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండే తీరు క‌ర్నూలు జిల్లాలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. గ‌తంలో రాజ‌కీయ విభేదాలు పెరిగి పెద్ద‌వై.. ఒక‌రిని ఒక‌రు చంపుకుంటే.. ఇప్పుడు వ్య‌క్తిగ‌త స్థాయిలో ప‌గ‌లు.. ప్ర‌తీకారాలు క‌నిపిస్తున్నాయి. పొలిటిక‌ల్ ఫ్యాక్ష‌న్ జిల్లాలో త‌గ్గిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా మాత్రం ఇప్ప‌టికి త‌గ్గ‌లేదు.

హ‌త్య‌కు హ‌త్యే స‌మాధానం అన్న‌ట్లుగా క‌ర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు క‌నిపిస్తాయి. ప్రాణానికి ప్రాణ‌మే స‌మాధానం అన్న‌ట్లుగా చేసే హింస కార‌ణంగా ఈ మ‌ధ్య‌న హ‌త్య‌లు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి హ‌త్యే మ‌రొక‌టి చోటు చేసుకుంది. పాత‌క‌క్ష‌ల నేప‌థ్యంలో గ‌తంలో జ‌రిగిన ఒక హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన వ్య‌క్తిని తాజాగా అతి దారుణంగా చంపేశారు.

క‌ల్లూరు మండ‌లం రుద్ర‌వ‌రం స‌మీపంలోని బోయ కృష్ణ గ‌తంలో జ‌రిగిన ఒక హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు. హంద్రీనీవా కాలువ ద‌గ్గ‌ర జ‌రిగిన ఎంకే రాముడ్ని కృష్ణ హ‌త్య చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాముడు హ‌త్య కేసులో కృష్ణ ప్ర‌ధాన నిందితుడు. ఈ నేప‌థ్యంలో కృష్ణను ఈరోజు అతి దారుణంగా హ‌త్య చేశారు.

క‌ర్నూలుకు బైక్ మీద వెళుతున్న కృష్ణ‌ను స్కార్పియోతో గుద్దేసి.. ఆ త‌ర్వాత క‌త్తుల‌తో పొడిచి చంపేశారు. క‌ర్నూలు జిల్లాలో ప్ర‌తీకార హ‌త్య‌లు దాదాపుగా ఇదే తీరులో ఉంటాయి. తాము ఎవ‌రినైతే టార్గెట్ చేశామో ఆ వ్య‌క్తి ఏ వాహ‌నంలో ప్ర‌యాణిస్తుంటే.. ఆ వాహ‌నానికి రెట్టింపు.. లేదంటే మూడింత‌లు పెద్ద‌దైన వాహ‌నాన్ని ఎంచుకుంటారు.

గురి చూసి దెబ్బేసిన‌ట్లుగా నిర్మాన్యుషంగా ఉన్న ప్రాంతం వ‌ద్ద‌కు రాగానే త‌మ వాహ‌నంతో గుద్దేస్తారు. ఆ వెంట‌నే.. బాంబులతో దాడి చేయ‌టం లేదంటే క‌త్తుల‌తో పొడిచేయ‌ట‌మో జ‌రుగుతుంది. తాజా ప్ర‌తీకార హ‌త్య కూడా ఇదే రీతిలో జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా హ‌త్య‌తో రుద్ర‌వ‌రం గ్రామంలో ఉద్రిక్త‌త నెలకొంది. హ‌త్య‌కు కార‌ణ‌మైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొస‌మెరుపు ఏమిటంటే.. ఈ త‌ర‌హా హ‌త్య కేసుల్లో నిందితుల్ని పోలీసులు ప‌ట్టుకునే లోపే.. వారికి వారే వ‌చ్చి లొంగిపోయే వైనం ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. కొన్ని కేసుల్లో మాత్రం ఇందుకు భిన్నంగా నిందుతుల్ని పోలీసులు ప‌ట్టుకుంటుంటారు.