Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి ముఖ్య అనుచరుడ్ని చంపేశారు
By: Tupaki Desk | 3 Aug 2017 7:52 AM GMTఅధికారంలో ఉన్న పార్టీ నేతలకు రక్షణ ఎక్కువ అంటారు. అయితే.. ఏపీలో అలాంటిదేమీ లేదన్న విషయం మరోసారి రుజువైంది. అధికారపార్టీకి చెందిన మంత్రికి అత్యంత ముఖ్య అనుచరుడ్ని అతి దారుణంగా చంపేయటం ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనాన్ని రేపుతోంది.
ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు ముఖ్య అనుచరుడు.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో సీనియర్ నేతగా సుపరిచితుడైన బాదన్నను అతి దారుణంగా హతమార్చిన వైనం ఈ రోజు చోటు చేసుకుంది. గోళ్ల గ్రామానికి చెందిన బోయ బాదన్న ఈ రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లారు.
వాకింగ్ చేస్తున్న వేళ.. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి.. తల.. భుజాల మీద విచక్షణారహితంగా నరికేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాదన్నను గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటం ఆయన మరణానికి కారణంగా చెబుతున్నారు.
బాదన్నహత్యతో ఆయన స్వగ్రామమైన గోళ్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా పని చేసిన బాదన్న ప్రస్తుతం వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బంధువులతో ఉన్న గొడవలే హత్యకు కారణంగా మారి ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. హత్యకు కారణాల మీద ఇంకా స్పష్టత రాలేదు. తాజా హత్య జిల్లాలో పెను సంచలనానికి దారి తీసింది. మంత్రికి అత్యంత సన్నిహితుడైన అనుచరుడు దారుణంగా హత్యకు గురి కావటంపై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.