Begin typing your search above and press return to search.
21 రోజుల కర్ఫ్యూ..'మరో కోణాలు' మర్చిపోతున్న నిజాలు
By: Tupaki Desk | 26 March 2020 3:30 AM GMTమన దేశమంత సిత్రమైన దేశం మరొకటి ఉండదు. ఓరేయ్ నాయనా.. మీ ఇంట్లో వాళ్లు ఎవరైనా విదేశాల నుంచి వస్తే మాకు చెప్పండి. కరోనా వేళ.. వారికి పరీక్షలు జరుపుతాం. జస్ట్ ఒక పద్నాలుగు రోజులు ఒక రూంలో ఉండి చస్తే.. మీరు బతకటమే కాదు.. మీ చుట్టు ఉన్నోళ్లను బతికిస్తారని ఘోష పెట్టినా అర్థం కాని పరిస్థితి. ఒక దేశ ప్రధానమంత్రి రెండు చేతులు జోడించి.. నా మాట వినండి.. మీరు 21 రోజులు ఇళ్లల్లో నుంచి రావొద్దంటూ వేడుకుంటే.. మోడీకేముంది? ఎన్ని మాటలైనా చెబుతాడు? మూడు వారాలు ఇంట్లో నుంచి రాకుంటే ఎలా గడుస్తుంది? రెక్కాడితే డొక్కాడని కుటుంబాల మాటేమిటి? ఎక్కడిదాకానో ఎందుకు కరెంటు బిల్లు కట్టకుండా ఒప్పుకుంటారా? అంటూ తెగ లా పాయింట్లు లాగేస్తున్నారు. అయితే.. ఇలాంటి వాదనలు వినిపించేటోళ్లంతా వాస్తవాల్ని మర్చిపోతున్నారు.
ఇప్పుడేమైనా చెబితే అదంతా గీత బోధిస్తున్నట్లు ఉంటుంది. అందుకే.. మీ జీవితంలో కానీ.. కొందరి జీవితాల్లో మనకు కనిపించే కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. వాటిలో నుంచి ఇప్పటి సమస్యను చూద్దాం.
ఉదాహరణ నెంబరు 1
అరకొర జీతం. కిందామీదా పడుతూ బతుకు బండి లాగించే మధ్యతరగతి జీవి. జీతం వచ్చిన ఐదు రోజుల్లోనే కమిట్ మెంట్ల కోసం ఖర్చు అయ్యే పరిస్థితి. చేతిలో మిగిలిన అరకొరతో.. మళ్లీ వచ్చే ఫస్ట్ తారీఖు కోసం ఆశగా ఎదురుచూసేటోడు. ఒకరోజు ఆఫీసుకో.. కూరగాయలు తేవటానికో.. సరుకులు తీసుకురావటానికో.. ఇంట్లో వాళ్లను బస్టాప్ దగ్గర దింపి రావటానికి వస్తూ.. యాక్సిడెంట్ కు గురయ్యాడనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? చేతిలో ఉండే కొద్ది పాటి డబ్బుతో వైద్యమైతే జరగదు కదా? సదరు ప్రమాదంలో కాలికి ఫ్యాక్చర్ అయింది. 21 రోజుల పాటు ఇంట్లోనే రెస్టు తీసుకోవాలి. అలా కాదని నడిస్తే.. మొత్తం కాలికే ప్రమాదం అన్నారనుకోండి? జీవితంలో ఎప్పుడూ మూడు వారాలు ఆఫీసుకు సెలవు పెట్టిన హిస్టరీ లేనోడు.. చివరికి పెళ్లి వేళలోనూ సెలువులు పెద్దగా తీసుకోనోడు సైతం ఇంట్లో ఉంటాడా? నో.. నెవ్వర్ అంటూ కుంటుకుంటూ ఆఫీసుకు వెళతాడా? మరి.. ఆ వైద్యానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
ఉదాహరణ నెంబరు 2
అతడో చెత్త ఏరుకునే కార్మికుడు. ఎంత చెత్త పోగు చేస్తే అంత డబ్బులు వస్తాయి. అవి కూడా మామూలోడు ఒక పూట రెస్టారెంట్ కు వెళ్లి.. వారి ఫ్యామిలీ కడుపు నిండా తినేస్తే అయ్యే మొత్తానికి.. సదరు చెత్త ఎత్తుకునే కార్మికుడు వారం పని చేస్తే కానీ రావు. అలాంటోడికి అనుకోని రీతిలో కష్టం వచ్చి.. వాడి పిల్లలకు పెద్ద జబ్బు చేసిందనుకుందాం? డబ్బుల్లేని వాడు.. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండిపోతాడా? లేదంటే.. వాడికున్న పరిచయాల్లో వాళ్లని.. వీళ్లని అడిగి కాస్తా డబ్బులు తీసుకొని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయిస్తాడా? లేదంటే వైద్యం అయ్యే ఖర్చు.. తన రోజువారీ సంపాదన లెక్క వేసుకొని.. కుదరదని ఊరుకుంటాడా?
ఉదాహరణ నెంబరు 3
వేటికి లోటు ఉండని జీవితం. కోరుకున్నవి ఇట్టే సమకూరటం ఇలాంటి వారికి మాత్రమే సాధ్యం. అలాంటి వారు మోజుపడి స్విస్ టూరుకు ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా వెళ్లాల్సిన రెండురోజుల ముందు కరోనా కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. వారి జీవితంలో అంతకుమించిన డిస్పాయింట్ మెంట్ మరొకటి లేదు. తీవ్రమైన నిరాశ. ఎన్నో కలలు కన్నారు. ఛత్.. ఈ పాడు కరోనా నెల ఆలస్యంగా మీద పడినా బాగుండేది కదా? అన్న మాట వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణ నెంబరు 4
మీరో కంపెనీలో మంచి స్థానంలో ఉన్నారు. మీ బాస్ ఫారిన్ నుంచి వస్తున్నారు. ఆ రోజు కీలకమైన మీటింగ్. అందులో మీరు చెప్పే ప్రాజెక్టు డిటైల్స్ తో మీ స్థానం ఎక్కడికో వెళ్లిపోతుంది. అలాంటి రోజున మీరెంతో ఇష్టపడే శ్రీమతి మిమ్మల్నిబయటకు తీసుకెళ్లమంటే మీకు మండుతుంది. అలా అని.. ఆమె కంటే ఎక్కువేమీ కాదు మీకు. అయితే.. మరింత ఎదిగేందుకు ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదన్న సందర్భంలో మీ భార్య కోరికను కాదంటారు. ఈ సీన్ కు మరికాస్తా యాడ్ చేస్తాడు.
మీరు తయారై వెళుతున్న వేళ.. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వేళ.. ఒక్కసారిగా మీ ఆవిడ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడేమవుతుంది. ఫారిన్ నుంచి వచ్చే మీ బాస్.. మీ ప్రజంటేషన్ కంటే కూడా.. మీ భార్య ఆరోగ్యమే మీకు ముఖ్యమవుతుంది.
ఉదాహరణ నెంబరు 5
ఇంట్లో ఉండే అమ్మానాన్నలు. వారికి అవసరమైనవన్నీ చేసి పెట్టటం.. చూడటం చేస్తుంటారు. వారు అడిగే వాటికి కొన్నిసార్లు మీకుండే ఒత్తిడిలోనో.. ఇంకేదైనా కారణంతోనో సరిగా సమాధానం చెప్పకపోవచ్చు. కానీ.. వారికేమైనా అయితే.. విలవిలలాడిపోతారు. వారి కోసం దేనినైనా పక్కన పెట్టేస్తారు.
ఉదాహరణ నెంబరు 6
మీ గాళ్ ఫ్రెండ్ ఊరి నుంచి వస్తోంది. ఆ రోజు ఆమె పుట్టినరోజు. ఎట్టి పరిస్థితుల్లో కలవాలనుకున్నారు. ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. అంతా రెఢీ అయిన వేళ.. అనుకోని రీతిలో మీ అన్నకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అప్పుడేం జరుగుతుంది? ఊరి నుంచి వచ్చే గాళ్ ఫ్రెండ్ కంటే అన్నకు ఏమైందన్న ఆందోళనే ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు చెప్పిన అన్ని ఉదాహరణల్ని చూసినప్పుడు.. అందరికి అన్ని ముఖ్యమే. ఈ ఆరింట్లోనూ కామన్ అంశం.. అనుకోని ఉత్పాతం మీద పడటం. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అప్పటివరకూ ఉన్న ప్రాధామ్యాలు మారిపోతాయి. కొత్త అంశాలు.. అవి ఎంత కష్టమైనా.. నష్టమైనా.. ఇబ్బందిపెట్టినా వాటిని పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతిమంగా మీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమన్నట్లు ఉంటారు. ఆ సందర్భంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమిస్తారు. ఇప్పుడు దేశానికే ముప్పు వచ్చి పడింది. మూడు వారాలు ఇంట్లో నుంచి రాకుంటే.. చాలానే కష్టాలు.. మరెన్నో నష్టాలు ఉంటాయి. అలా అని బయటకు వస్తే.. ప్రాణాలే పోతాయే? ఇప్పుడుచెప్పండి మీకు కావాల్సింది మీ ప్రాణాలు.. మీ ఇంట్లో వారి ప్రాణాలు.. మీ పక్కనున్న ప్రాణాలా? బతికినంత కాలం ఉండే ఆకలి.. ఆర్థిక చిక్కులా? ఇక్కడ మీ ఛాయిస్ ఏ మాత్రం తేడా ఉన్నా.. మీరే కాదు.. మీ చుట్టూ ఉన్న వారంతా ప్రమాదంలో పడతారన్నది అస్సలు కావొద్దు సుమా.