Begin typing your search above and press return to search.
JNUలో దారుణం వెనుక విస్తుగొలిపే నిజాలు?
By: Tupaki Desk | 7 Jan 2020 6:23 AM GMTఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో విద్యార్థులపై పడి దారుణంగా దాడి చేసిన ముసుగు దుండుగులు తోటి విద్యార్థులేనన్న కఠిన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ముసుగు వీరులు ఇలా JNUపై పడి ఇంత బీభత్సం చేయడానికి కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ఇంత పాశవికంగా దాడి చేసి కొట్టడానికి గల కారణాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) ఉద్యమాల పురిటిగడ్డ. మన ఉస్మానియా కంటే కూడా ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల వారు వచ్చి చదువుకుంటుండడంతో అభ్యుదయ భావాలు ఎక్కువ. దేశంలో ఏ వ్యతిరేక చట్టం చేసినా.. మైనార్టీల హక్కులు కాలరాసినా.. గోరక్షణ, సీఏఏ, ఎన్నాఆర్సీ, అయోధ్య కేసు ఏదైనా దేశంలో మొదట స్పందించేది జేఎన్ యూ విద్యార్థులే.. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యూనివర్సిటీ మొదటి నుంచి అభ్యుదయ వాదానికి పెట్టింది పేరు. కమ్యూనిస్టులు, హిందుత్వ వ్యతిరేక సంఘాలకు నెలవై ఈ యూనివర్సిటీ ఉంది. వీరంతా బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
JNUలో చదువుకున్న వాళ్లు కమ్యూనిస్టు ఆలోచనా ధోరణితో విప్లవాలు తీసుకొస్తున్నారు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ, హిందుత్వ భావజాలం కనిపిస్తుంటుంది. ఈ రెండు వర్సిటీల విద్యార్థులు ఫక్తు వ్యతిరేక స్వభావం గలవారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఎన్నికలు నిషేధించినా కమ్యూనిస్టు ప్రభావం గల జేఎన్.యూలో మాత్రం నిషేధం విధించలేని పరిస్థితి నెలకొందంటే వారి ఆధిపత్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
JNUలో సమస్యలైనా దేశ సమస్యలైనా.. ఎక్కడ అన్యాయం జరిగినా రోడ్డెక్కి నిరసన తెలుపడం ఇక్కడి విద్యార్థులకు వెన్నతో పెట్టిన విద్య. దేశంలో ఏ యూనివర్సిటీలో లేనంత తక్కువ చార్జీలు JNUలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. పెంచితే వీళ్లంతా పోరాడుతారు. 40 ఏళ్లుగా JNUలో హాస్టల్ చార్జీలు పెంచలేదంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు రూ.10000 ఉంటే JNUలో కేవలం 300 మాత్రమే. ప్రస్తుతం అక్టోబర్ 28న పెంచిన హాస్టల్ చార్జీలపై వీళ్లు నిరసన తెలుపుతున్నారు.
ప్రస్తుత వివాదానికి శీతాకాల సెమిస్టర్స్ కారణంగా చెబుతున్నారు. ఆరునెలలకోసారి జరిగే సెమిస్టర్ పరీక్షలు జరగకుండా కొందరు విద్యార్థులు సర్వర్ పాడు చేశారట.. దీనిపై ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితమే పరీక్షలు జరగకుండా కంప్యూటర్ కేబుల్ ను తెంపేస్తుంటే ఏబీవీపీ వాళ్లు అడ్డుకున్నారు. అయితే కమ్యూనిస్టు భావజాలతో పరీక్షలు జరగకుండా అడ్డుకుంటున్న JNUవిద్యార్థులపై ఆగ్రహంతోనే ఏబీవీపీ స్టూడెంట్స్ ఈ దాడి చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా కమ్యూనిస్టు స్టూడెంట్స్, ఏబీవీపీ స్టూడెంట్స్ మధ్య వివాదాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. కమ్యూనిస్టు స్టూడెంట్స్ ఆధిపత్యాన్ని JNUలో తట్టుకోలేక.. వారి ఆగడాలపై ఏబీవీపీ వాళ్లు తిరగబడి ఉంటారని చెబుతున్నారు.