Begin typing your search above and press return to search.
కేసీఆర్ చెప్పిందొకటి..అక్కడ జరిగిందొకటి..
By: Tupaki Desk | 27 Aug 2015 5:42 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు తెలంగాణలో విలువే లేదా? అది కూడా సామాన్య పౌరులలో లేక...ప్రతిపక్ష పార్టీలో కాకుండా ప్రభుత్వ అధికారులే పాటించడం లేదా? స‌్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం గర్వంగా చెప్పిన దానికి కూడా వారు పట్టించుకోవడం లేదా? అంటే అవుననే అంటున్నారు ప్రభుత్వ అధికారులు.
"పేదల పట్ల మా ప్రభుత్వానికి శ్రద్ధ ఉంది. ఇందుకు నిదర్శనంగా జీవో నం.58 కింద హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని 9 జిల్లాల్లో 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీరికిచ్చిన భూమి దాదాపు రూ.10 వేల కోట్ల విలువ ఉంది" అని గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ పంద్రాగస్టు రోజున ప్రకటించారు. అయితే అదంతా ఒట్టిదేనని తేటతెల్లమైంది. సమాచార హక్కు చట్టం కింద సీపీఎం నాయకుడొకరు వివరాలు అడిగితే ఆయా జిల్లాల కలెక్టరేట్ అధికారులు ఈ మేరకు ఇచ్చారు.
ఆ స్పందన ప్రకారం..రంగారెడ్డిలో జీవో నం.58 కింద 125 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించడానికి 1,43,790 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 63,800 మందికి పట్టాలివ్వాలని నిర్ణయించగా.. పంపిణీ చేసింది 48,474 పట్టాలే. ఇక, హైదరాబాద్ లో 12,502 మందికి పట్టాలివ్వాలని నిర్ణయించగా.. 11,736 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ రెండు జిల్లాల్లోనూ కేవలం 60,210 పట్టాలే పంపిణీ చేయడం గమనార్హం.
మొత్తంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా...ఈ రకంగా నత్తనడకన ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికారుల పనితీరుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.