Begin typing your search above and press return to search.
కేసీఆర్ కోట 'ప్రగతి భవన్' రహస్యం
By: Tupaki Desk | 21 Oct 2019 5:30 PM GMTప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.. కేసీఆర్ ఏరికోరి ముచ్చటపడి ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బేగంపేటలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని క్రైస్తవ మతాచారం పద్ధతిలో కట్టుకున్నాడు. అయితే రాష్ట్రం విడిపోవడం.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అందులోనే కొద్దిరోజులు ఉన్నారు. అయితే కేసీఆర్ కు ఆ భవనం కలిసి రాలేదు. దీంతో వాస్తు పండితులకు చూపించగా.. ఈ భవనం పనికిరాదని తేల్చారు..
దీంతో కేసీఆర్ పంజాగుట్టలోని పది మంది ఐఏఎస్, 24మంది ఇతర అధికారుల క్వార్టర్లను తొలగించి ‘ప్రగతి భవన్’ పేరిట తెలంగాణ సీఎం కార్యాలయాన్ని కట్టించాడు. 2016 మార్చిలో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం నవంబర్ 23న పూర్తైంది. చినజీయర్ స్వామి సమక్షంలో కేసీఆర్ సాంప్రదాయ ఆచారాలు నిర్వహించి ఈ భవనంలోకి సీఎం హోదాలో ప్రవేశించారు. పక్కా వాస్తు ప్రకారం కట్టిన ఈ భవనం నియోక్లాసికల్ - పల్లాడియన్ నిర్మాణ శైలిలో నిర్మించారు. దేశంలోనే పేరొందిన వాస్తు శిల్పి హఫీజ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం పూర్తైంది.
తెలంగాణ సీఎం నివాసమైన ‘ప్రగతి భవన్’ బ్రిటీష్ రెసిడెన్సీ - ఫలక్ నుమా ప్యాలెస్ వంటి చారిత్రక భవంతుల నిర్మాణాన్ని పోలీ ఉంటుంది. దీని నిర్మాణాన్ని వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజ పర్యవేక్షించాడు. 38 కోట్లతో షాపూర్జీ - పల్లోంజీ నిర్మాణ సంస్త కేవలం 9 నెలల్లోనే కట్టింది.
వెనుకటికి రాజులు - రాజ్యాల పటిష్టత కోసం ఎత్తైన ప్రదేశాలు - గుట్టలపై ఇలానే కోటలు - రాజభవనాలు కట్టుకునేవారు.. కేసీఆర్ కూడా ఇలానే గద్దెనెక్కగానే తన కోసం కట్టుకున్న ఈ ప్రగతి భవన్ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇందులోకి ప్రవేశం సామన్యులకు గగనమైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఇతరులకు కూడా కేసీఆర్ దర్శన భాగ్యం కలగడం అంత తేలికకాదనే ప్రచారం సాగింది.. రాజు వలె సొంత భవనాన్ని కట్టుకున్న కేసీఆర్ అందులో దుర్భేద్యమైన పాలన సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటాయి. అయితే ఎవరు ఏమన్నా వాస్తు - సిద్ధాంతాలు - నమ్మకాలు నమ్మే కేసీఆర్ తన ప్రగతి భవన్ నుంచే తెలంగాణను పాలిస్తుండడం గమనార్హం.