Begin typing your search above and press return to search.

మోడీ..కేజ్రీ సర్కార్ల మధ్య రచ్చ అసలెందుకు?

By:  Tupaki Desk   |   16 Dec 2015 5:03 AM GMT
మోడీ..కేజ్రీ సర్కార్ల మధ్య రచ్చ అసలెందుకు?
X
కేంద్రంలోని మోడీ సర్కారుకు.. ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు మధ్య రచ్చలు ఈ మధ్యన పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఢిల్లీ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాయంలో సీబీఐ సోదాలు నిర్వహించటం సంచలనంగా మారింది.అవినీతి ఆరోపణలపై సీబీఐ సోదాలు నిర్వహించినట్లు చెబుతున్న ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపుడుతన్నాయి. సీబీఐతో మోడీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నయి. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచివా.. చెడ్డవా అన్న విషయాల్ని కాసేపు పక్కన పెట్టి.. అసలీ వ్యవహారం ఇంత వరకు ఎందుకు వచ్చింది..? రాజేంద్రకుమార్ మీద ఉన్న ఆరోపణలు ఏమిటన్న సంగతి చూస్తే..

అసలు వివాదం ఏమిటి?

ఢిల్లీ సర్కారులో పని చేస్తున్న రాజేంద్రకుమార్ కొన్ని సంస్థలకు టెండర్లు దక్కటానికి అనుకూలంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ రాష్ట్ర సర్కారు ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.

వివాదం పూర్వాపరాలేమిటి?

2007 – 14 మధ్య కాలంలో ఐదు కాంట్రాక్టులకు సంబంధించి రూ.9.5కోట్లు విలువైన పనులు తనకు నచ్చిన సంస్థలకు వచ్చేలా చేశారన్నది ఆరోపణ.

కేసు ఎప్పుడు నమోదైంది?

రాజేంద్రకుమార్ మీద అవినీతి ఆరోపణల మీద విచారణ యూపీఏ హయాంలోనే మొదలైంది.

పెట్టిన కేసులేంటి?

ఐపీసీ సెక్షన్ 120 బి.. అవినీతి నిరోధక చట్టం లోని 13(1)డి.. 19(2) సెక్షన్లు

తాజాగా ఏం జరిగింది?

రాజేంద్రకుమార్ ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర సర్కారు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేసమయంలో ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్ లోని 14 చోట్ల సోదాలు చేపట్టింది. రాజేంద్రకుమార్ కార్యాలయంతో పాటు.. ఆయన నివాసంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఏమేం స్వాధీనం చేసుకున్నారు?

సోదాల అనంతరం.. కొన్ని కీలక ఫైళ్లు.. రూ.2.4లక్షల క్యాష్.. రూ.16 విలువైన వస్తువులు.. రూ.3లక్షల ఫారిన్ కరెన్సీలు స్వాధీనం చేసుకున్నారు.

సోదాల తర్వాత ఏం జరిగింది?

ఆరోపణలపై సోదాలు నిర్వహించిన సీబీఐ.. రాజేంద్రకుమార్ ను అదుపులోకి తీసుకుంది. ఆయన్ను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి 7 గంటలు పాటు ప్రశ్నించారు.