Begin typing your search above and press return to search.
రిలయన్స్ - ఫేస్ బుక్ డీల్ అంతా నాటకమేనా?
By: Tupaki Desk | 23 April 2020 8:50 AM GMTకర్లో దునియా ముఠ్ఠీమే అంటూ....చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ....జియో జీ భర్ కే అంటూ కారు చౌకగా మొబైల్ డేటాతో పాటు ఫోన్ ను అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇక, `జియోమార్ట్`పేరుతో `దేశ్ కీ నయీ దుకాన్` అంటూ రిటైల్ ఈ-కామర్స్ సంస్థలకు రిలయన్స్ షాకిచ్చింది. ఇప్పటివరకు ముంబైకే పరిమితమైన తన సేవలను ఇకపై జియోమార్ట్ దేశవ్యాప్తంగా అందించనుంది. దీనికితోడు, రిలయన్స్ గ్రూప్ లో భాగమైన జియో ప్లాట్ ఫామ్స్ లో 9.99 శాతం వాటాలను దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఈ కామర్స్ రంగంలో మరింత వేగంగా దూసుకుపోయేందుకు రంగం సిద్ధమైంది. రూ.43,574 కోట్ల విలువైన అతిపెద్ద ఎఫ్ డీఐ డీల్ తో ఇక నుంచి ఫేస్ బుక్ లో భాగమైన వాట్సాప్ సాయంతో భారత ఈ కామర్స్ రంగంలో జియో మార్ట్ దూసుకుపోనుంది. దీంతోపాటు - భారత మార్కెట్ లో తన పరిధిని పెంచుకునేందుకు ఫేస్ బుక్ కు కూడా ఈ భారీ డీల్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు.....కానీ, ఈ డీల్ వెనుక అసలు కథ వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ జియోను ఒడ్డున పడేసేందుకు ఫేస్ బుక్ పెట్టుబడులు పెట్టిందని టాక్ ఉంది. మరోవైపు యూఎస్ ఏలో కరోనా విపత్తు వల్ల... ఫేస్ బుక్ షేర్ వ్యాల్యూ కూడా పడిపోవడం వల్లే జియోలో పెట్టుబడుల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతోందని టాక్ వస్తోంది.
ఇప్పటికే ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆన్ లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ (దేశ్ కీ నయీ దుకాన్) ద్వారా రిలయన్స్ సేవలందిస్తోంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా తన సేవలను అందించనుంది. జియో ప్లాట్ ఫాం - రిలయన్స్ రిటైల్ - వాట్సాప్ ల మధ్య డీల్ వల్ల జియోమార్ట్...ఫ్లిప్ కార్ట్ - అమెజాన్ వంటి సంస్థలకు గట్టిపోటీనివ్వనుంది. ఈ డీల్ వల్ల స్థానిక - చిన్న కిరాణా దుకాణాలు ఆన్ లైన్ లోకి రాబోతున్నాయి. ఇకపై సమీప కిరాణా దుకాణాల ద్వారా వాట్సాప్ లో ఆన్ లైన్ చెల్లింపులతో ఇళ్లకు సరుకులు చేరతాయి. వాట్సాప్ సేవలకు ప్రభుత్వ అనుమతి తర్వాత వర్తకులే హోమ్ డెలివరీ చేస్తారు.ఇప్పటికే బీటా దశలో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ సేవలను త్వరలో భారత్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభం కానప్పటికే చాలా మంది కిరాణా వర్తకులు జియో మార్ట్ తో ఒప్పందం చేసుకున్నారు. గూగుల్ పే - పేటీఎం - ఫోన్ పే వంటి కంపెనీలకు వాట్సాప్ గట్టి పోటీ ఇవ్వనుందని ముకేశ్ అంబానీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో ఆన్ లైన్ గ్రోసరీకి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జియోమార్ట్ సంచలనం రేపనుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ డీల్ ద్వారా రిలయన్స్ లో అతి పెద్ద మైనారిటీ షేర్ హోల్డరుగా ఉంటామని ఫేస్ బుక్ తెలిపింది. ఈ డీల్ తో జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు చేరింది. ఈ డీల్ ప్రకారం.. జియో ప్లాట్ ఫామ్స్.. ఫేస్ బుక్ కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. ఈ డీల్ ద్వారా వచ్చే ఆదాయంలో రూ. 15,000 కోట్లను తన దగ్గరే ఉంచుకొని - మిగతా రూ. 40,000 కోట్లను రుణాలను తీర్చడానికి రిలయన్స్ ఉపయోగిస్తుంది. ఇది నాన్–ఎక్స్ క్లూజివ్ డీల్ కావడంతో మిగతా భారత - విదేశీ కంపెనీలతో కూడా ఫేస్ బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2017లో దేశీయంగా 45 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2022 నాటికి 85 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం ఫేస్ బుక్ కు భారత్ లో 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, అందులో భాగమైన వాట్సాప్ నకు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. జియోకు 38.8 కోట్ల పైగా ఫోన్ సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. జియోతో జట్టు కట్టడం ద్వారా కోట్ల కొద్దీ యూజర్లకు మరింతగా చేరువ కావడానికి ఫేస్ బుక్ కి ఈ డీల్ ఉపయోగపడనుంది.ఇక, జియోలో ఫేస్ బుక్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడం - అమెరికా సెనేట్ భారీ ప్యాకేజీకి ఆమోదం తెలపడం - ముడిచమురు ధరలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం అనుకూలంగా మారాయి. బుధవారం బీఎస్ ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లపైకి - నిఫ్టీ 9,100 పాయింట్లపైకి ఎగబాకాయి. జీవిత కాల కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకోవడం కలసివచ్చింది. సెన్సెక్స్ 743 పాయింట్లు పెరిగి 31,380 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 206 పాయింట్ల పెరిగి 9,187 పాయింట్ల వద్ద ముగిశాయి
అయితే, ఈ డీల్ వెనుక అసలు మర్మం వేరే ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచమంతా కరోనా కల్లోలం రేపుతున్న సమయంలో....సమీప భవిష్యత్తులో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యం రాబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో...ఇంత భారీ డీల్ కుదుర్చుకోవడం వెనుక వేరే మతలబు ఉందని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ రుణ భారం రూ.1.53 లక్షల కోట్లుగా ఉందని - ఆ అప్పుల ఊబిలోనుంచి బయటపడేందుకు రిలయన్స్ ఈ డీల్ చేసుకుందని అంటున్నారు. తాజాగా వచ్చిన భారీ నిధులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ భారం భారీగా తగ్గించుకోవాలనే ప్లాన్ వేస్తోందని అంటున్నారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా మార్కెట్ కుప్ప కూలింది. దీంతో, ఫేస్ బుక్ షేర్లు కూడా పెద్దగా లేవు. ఇంకా చెప్పాలంటే లాక్ డౌన్ వల్ల, ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు వల్ల దాదాపుగా అన్ని మార్కెట్లు కుదేలయ్యాయి. చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించడం - తగ్గించడం....కొత్త ప్రాజెక్టులను రద్దు చేసుకోవడం వంటివి చేస్తున్నాయి. ఈ సమయంలో ఇంత భారీ డీల్ చేయడం నిజంగా సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జియో మొత్తం విలువ రూ. 4 లక్షల 63 వేల కోట్లని అంచనా. అయితే, రూ.1.53 లక్షల కోట్ల అప్పులున్న జియోలో ఫేస్ బుక్ ఇంత భారీ ధరకు షేర్లు కొనడం వెనుక మతలబేమిటన్నది ఆర్థిక నిపుణులు సందేహిస్తున్నారు. ట్విటర్ పుంజుకున్నాక ఫేస్ బుక్ వ్యాల్యూ పడిపోయిందని...అందువల్లే ఫేస్ బుక్ జియోతో తన పాపులారిటీ పెంచుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఈ డీల్ వెనుక ఏదో గందరగోళం ఉందని అనుమానిస్తున్నారు. అప్పుల్లో ఉన్న జియో షేర్లు ఫేస్ బుక్ ఎగబడి కొనడం వెనుక ..ఆ రెండు కంపెనీల డొల్లతనం బయటపడుతోందని అంటున్నారు. ఏది ఏమైనా...ఓ వైపు కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పుకూలుతుంటే...మరోవైపు ఇంత భారీ డీల్ జరగడం నిజంగా అనుమానాలకు తావిస్తోందని స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని....కనీవినీ ఎరుగని మార్పులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో ఈ డీల్ నిజంగా పలు సందేహాలకు తావిస్తోంది.