Begin typing your search above and press return to search.
శేషాచలం 10 అప్‌డేట్స్ష్మ్ అడవిలో 500 మంది ఉన్నారా?
By: Tupaki Desk | 7 April 2015 11:32 AM GMTఏళ్లకు ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లర్లకు తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది ఎన్ కౌంటర్ కావటం జరిగింది. ఒకేఘటనలో ఇంతమంది ఎన్‌కౌంటర్ కావటం చాలా అరుదు. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారన్న వాదన వ్యక్తమవుతోంది.
మరోవైపు.. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాజకీయ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు.. ఎర్రచందనం స్మగ్లర్ల కారణంగా గాయపడిన పోలీసుల సంఖ్య పదికి చేరుకుందని చెబుతున్నారు. శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పది అప్‌డేట్స్ చూస్తే..
1. శేషాచల ఎన్ కౌంటర్ స్మగ్లర్లను ఎన్ కౌంటర్ చేసే ఉద్దేశ్యంలో మొదలుకాలేదని.. లొంగిపోవాలని హెచ్చరిస్తే.. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. కూలీలు.. స్మగ్లర్లు కత్తులు.. బరిసెలు.. గొడ్డళ్లు.. రాళ్లు పోలీసులపై విసిరినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పోలీసులు కాల్పులు జరపాల్పి వచ్చిందంటున్నారు.
2. చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ నాయుడు అనే స్మగ్లర్ 500 మందిని అడవిలోకి పంపినట్లు చెబుతున్నారు. ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
3. శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై తమిళనాయులు ఆగ్రహం వ్యక్తం చ్స్తేున్నారు. ఎన్‌కౌంటర్ లో మరణించిన వారిలో తమిళనాడుకు చెందిన కూలీలే ఎక్కువ మంది కావటం గమనార.
4. ఏపీ పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలంటూ శేషాచల ఎన్ కౌంటర్‌పై అగ్రహం చెందుతూ ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేస్తున్నారు. శేషాచల ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు పీసీసీ ఇళంగోవన్.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళనై సౌందరరాజన్ లు ఖండించారు.
5. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో పది మంది వరకు పోలీసులు గాయపడినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఒక ఎస్ ఐ.. మరో ఏఎస్‌ఐ.. పలువురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
6. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ పై కేంద్రం ఆరా తీసింది. ఏపీ రాష్ట్ర డీజీపతో కేంద్రహోంశాఖ ఉన్నతాధికారులు ఫోన్ లో చర్చలు జరిపారు. ఎన్‌కౌంటర్‌పై నివేదిక ఇవ్వాలని కోరింది.
7. శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ విచారణకు ఆదేశించారు
8. శేషాచల అడవుల్లోకి పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు.. కూలీలు దాదాపుగా 450 మందికి పైనే ఉన్నారని చెబుతున్నారు. వీరి కోసం పెద్దఎత్తున గాలింపు చేపట్టారు.
9. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులు.. డీజీపీ కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితి సమీక్షించారు.
10. అడవులను.. అటవీ సిబ్బందిని పరిరక్షించేందుకు తమ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పని చేస్తుందని డీఐజీ కాంతారావు పేర్కొన్నారు. అడవుల్లోకి రావద్దని కోరినా ఎర్రచందనం స్మగ్లర్లు రావటం ఆపటం లేదని.. ఈ రోజు జరిగిన గుణపాఠంతో తమిళనాడు స్మగ్లర్లు.. కూలీలు శేషాచల అడవుల్లోకి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.