Begin typing your search above and press return to search.
సింహం సింగిల్ గా రాదంటున్న ఫడ్నవీజ్!
By: Tupaki Desk | 29 March 2018 9:52 AM GMTగత ఎన్నికల్లో బీజేపీకి శివసేన మిత్రపక్షంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, కొంత కాలంగా బీజేపీపై సందర్భానుసారంగా శివసేన విమర్శలు గుప్పిస్తోంది. మిత్రపక్షాలకు బీజేపీ కనీస గౌరవం ఇవ్వడం లేదని శివసేన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర లో దాదాపుగా ఆ రెండు పార్టీలు కలిసి బరిలోకి అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా - మహారాష్ట్ర శాసన మండలిలో....ఆ విషయం పై సీఎం ఫడ్నవీజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ - శివసేనలు కలిసిపోటీ చేస్తాయని ఫడ్నవీజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలుకలపై ఆసక్తికర చర్చ జరిగింది. సచివాలయంలో ఎలుకల నిర్మూలనకు గానూ కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలో లోపాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే అన్నారు. ఎలుకల నిర్మూలనకు 6 నెలల సమయం ఉందని - అయితే, 7 రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ఆ సంస్థ నివేదిక ఇచ్చిందని అన్నారు. దీంతో - ఎలుకలన్నీ కలిసి బీజేపీని సింహాసనం నుంచి కూలదోస్తాయని శాసనమండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్ బీజేపీని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై ఫడ్నవీజ్ స్పందించారు. 2019 ఎన్నికల్లో సింహం - పులి కలిసి పోటీ చేస్తాయని పరోక్షంగా బీజేపీ- శివసేన ల పొత్తును ఉద్దేశించి అన్నారు. తమను ఎలుకలు ఏమీ చేయలేవని, సింహం - పులి కలిసి ఎలుకల్ని నాశనం చేస్తాయని రిటార్ట్ ఇచ్చారు. పులి గురించి తెలుసని, సింహం ఎవరో తెలియడం లేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ అన్నారు. మీకు ఎలుకలు దారిచ్చినా....జంతువులకు వాటి స్ధానాన్ని ప్రజలు తప్పక తెలియజేస్తారన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సింహం - పులిల మధ్య ఉన్న బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.