Begin typing your search above and press return to search.

ఫడ్నవిస్ ని ప్రతిపక్ష నేతగా పిలవను ... సీఎం ఏంచెప్పాడంటే ?

By:  Tupaki Desk   |   2 Dec 2019 5:57 AM GMT
ఫడ్నవిస్ ని ప్రతిపక్ష నేతగా పిలవను ... సీఎం ఏంచెప్పాడంటే ?
X
మహారాష్ట్ర రాజకీయం తీవ్రమైన సంక్షభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత దాదాపుగా నెలరోజుల పాటు అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయం ఈ మద్యే కుదుటపడింది. ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పొత్తులతో బరిలోకి దిగిన బీజేపీ , శివసేన..ఎన్నికల తరువాత మాత్రం అధికారం కోసం ఇరు పార్టీలు పట్టుబట్టడంతో ఈ పంచాయితీ ముగియడానికి చాలా సమయం పట్టింది. బీజేపీ , శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ..ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసారు. కానీ , ఏ పార్టీ కూడా అధికారాన్ని వదులుకోవడానికి వెనుకడుగు వేయకపోవడంతో ..శివసేన పొత్తునుండి బయటకి వచ్చేసింది.

ఇక ఆ తరువాత శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించి .. అన్ని సిద్ధం చేసుకున్న తరువాత అనూహ్యంగా బీజేపీ , ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ , అజిత్ పవార్ ని తనదైన రాజకీయ వ్యూహంతో వెనక్కి వచ్చేలా శరద్ పవార్ చేయడంతో .. బీజేపీ మహారాష్ట్రలో మూడు రోజుల్లోనే అధికారాన్ని కోల్పోయింది. బలపరీక్ష లో నెగ్గే సంఖ్యా బలం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవిస్ తన సీఎం పదవికి రాజీనామా చేసారు.

ఆ తరువాత మళ్లీ శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఈ మూడుపార్టీలు కలిసి సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ని ఎన్నుకోగా ..అయన మహా సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోల్‌ స్పీకర్‌గా, ఫడ్నవిస్‌ ప్రతిపక్ష నాయకుడిగా నూతనంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఆదివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసలు, విమర్శలతో ముంచెత్తారు. "నేను దేవేంద్ర ఫడ్నవిస్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహంగా ఉంటాను. నేను మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా పిలవను, కాని నేను మిమ్మల్ని బాధ్యతాయుతమైన నాయకుడిగా పిలుస్తాను అని చెప్పారు.