Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

By:  Tupaki Desk   |   26 Nov 2019 10:57 AM GMT
బిగ్ బ్రేకింగ్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా
X
మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. మహారాష్ట్ర లో రేపు బల నిరూపణకు ఒకరోజు ముందే బీజేపీ నేత, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తన సీఎం పదవి కి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫడ్నవీస్ సాయంత్రం 4 గంటలకు ముంబై లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

సుప్రీం కోర్టు రేపు మహారాష్ట్ర అసెంబ్లీ లో బీజేపీ బలనిరూపణ చేయాలని ఈరోజు ఆదేశించింది. అనంతరం బీజేపీకి మద్దతు ఇచ్చిన అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అజిత్ పవార్ రాజీనామాతో బీజేపీ ఆశలు చచ్చిపోయాయి. దీంతో బీజేపీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా సాయంత్రం తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వద్దంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో చేతులు కలిపారని.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నట్టు లేఖ ఇవ్వడం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

కానీ ఇప్పుడు అజిత్ పవార్ వైదొలగడంతో అసెంబ్లీలో మాకు సంఖ్యాబలం లేని కారణంగా మహారాష్ట్ర లో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ఫడ్నవీస్ తెలిపారు. పార్టీల ను చీల్చే ఉద్దేశం తమకు లేదని.. అందుకే ఈ తెరచాటు రాజకీయాలు చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫడ్నవీస్ తెలిపారు.

ఇక శివసేన పార్టీ తమను నమ్మించి మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. ఎన్నికల ముందర తమతో పొత్తు పెట్టుకొని గెలిచాక అధికారం కోసం తమను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ ని శివసేన బెదిరించిందని ఆరోపించారు.

అజిత్ పవార్ తోపాటు ఎమ్మెల్యేలు వస్తారనే తాము మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కానీ ఆయనే వైదొలగడంతో రాజీనామా చేస్తున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్ర లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేయడం.. ప్రలోభ పెట్టడం బీజేపీ పార్టీ సిద్ధాంతం కాదని.. అందుకే వైదొలుగుతున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించారు.