Begin typing your search above and press return to search.
'తెలుపు'కు నో: 'ఫెయిర్ అండ్ లవ్లీ' పేరు మారుతోంది
By: Tupaki Desk | 26 Jun 2020 3:31 AM GMTప్రముఖ ఫెయిర్‌నెస్ ఫేస్ క్రీమ్ 'ఫెయిర్ అండ్ లవ్లీ' కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షపై చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ ప్రోడక్ట్ ఇక నుండి తమ ఉత్పత్తిలో పెయిర్ అనే పదాన్ని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు హిందూస్తాన్ యూనీ లీవర్ ప్రకటన చేసింది. కొత్త పేరును ఎంపిక చేశామని, రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉందని తెలిపింది. చర్మం రంగుకు సంబంధించి అవాంఛిత భావనలకు ప్రచారం కల్పించకుండా ఉండేందుకు పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
మా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగుల వారి కోసం ఉద్దేశించినవని, భిన్నత్వంలో ఏకత్వం భావనకు తాము ప్రాధాన్యతను ఇస్తామని తెలిపింది. ఫెయిర్ అండ్ లవ్లీలోని ఫెయిర్ అనే పదం కేవలం ఓ సమూహానికి మాత్రమే వర్తిస్తుండటంతో ఫెయిర్, వైట్, లైట్ వంటి పదాలను తమ ఉత్పత్తుల పేర్ల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు హిందూస్తాన్ యూనీ లీవర్ గురువారం తెలిపింది.
ప్రస్తుతం ఫెయిర్ అండ్ లవన్లీ ప్యాక్ పైన కాంతివంతమైన చర్మం కోసం, తెలుపు కోసం వంటివి ఉంటాయి. ఇక నుండి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. చర్మానికి సంబంధించి తెలుపు, కాంతి, మెరుపు వంటి పదాలు ఉపయోగించడం సరైనది కాదని గుర్తించామని, తమ ఉత్పత్తులను ప్రజల వద్దకు తీసుకు వెళ్లే విధానాన్ని సవరించుకుంటున్నట్లు హిందూస్తాన్ యూనీ లీవర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రెసిడెంట్ సన్నీ జైన్ తెలిపారు.
అంతేకాదు, ఫెయిర్ అండ్ లవ్లీ పైన ఇప్పటి వరకు ముద్రిస్తూ వస్తోన్న తెలుపు, నలుపు రంగు ముఖాలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపింది ఈ సంస్థ. కాగా, ఫెయిర్ అండ్ లవ్లీ నిర్ణయాన్ని నెటిజన్లు కూడా చాలామంది స్వాగతించారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమిస్తున్న నేపథ్యంలో పెయిర్ అండ్ లవ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.