Begin typing your search above and press return to search.
తల్లిదండ్రులపై విచిత్రమైన కేసు పెట్టిన కొడుకు
By: Tupaki Desk | 11 March 2021 4:30 AM GMTపరాన్న జీవులు అన్న పేరు వినే ఉంటారు. అలాంటి జీవిని చూడలేదన్న భావన ఉందా? మరేం ఫర్లేదు.. ఈ పెద్ద మనిషిని చూస్తే సరిపోతుంది. కని పెంచి.. మంచి విద్యాబుద్ధులు నేర్పించేందుకు వారు పడిన తపనను పక్కన పెట్టేయటమే కాదు..కొన్నేళ్లుగా తన అవసరాలు తీరుస్తున్న తల్లిదండ్రులపై కోర్టులో కేసు వేసిన ఈ పుత్రరత్నం గురించి.. అతడి యవ్వారాల గురించి తెలిస్తే.. లాగి పెట్టి రెండు పీకాలన్న భావన బలంగా అనిపించటం ఖాయం. మరీ.. ఇంతలా రియాక్టు కావటమా? మర్యాద మిస్ అవుతుందన్న భావన కలుగుతోందా? కానీ.. ఇతగాడి గురించి అంతా తెలిస్తే.. మీరు కూడా అలానే రియాక్టు కావటం ఖాయం. ఇంతకీ ఇతగాడు చేసిందేమిటన్న విషయంలోకి వెళితే..
అతడి పేరు ఫయాజ్ సిద్దిఖీ. వయసు 41 ఏళ్లు. దుబాయ్ కు చెందిన ఈ మధ్యవయస్కుడు తాజాగా తన తల్లిదండ్రుల మీద కేసు వేశాడు. ఎందుకంటారా? ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో లా డిగ్రీ పొందిన ఇతను.. ఇప్పటికి తల్లిదండ్రుల సంపాదన మీదనే బతుకుతున్నాడు. అయినప్పటికి ఇది సరిపోదని.. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకు ఆర్థిక సాయం చేయాలని కోర్టుకు ఎక్కాడు.
ఎందుకిలా అంటే.. సంపన్నులైన తన తల్లిదండ్రులు తన భారాన్ని జీవితకాలం మోయాలంటూ కేసు పెట్టేశాడు. ఎందుకిలా? అంటే ఆరోగ్య సమస్యలని చెబుతున్నాడు కానీ.. అంత సమస్యలు ఉన్నట్లు కనిపించటం లేదని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు తల్లిదండ్రుల నుంచి డబ్బులు రానట్లైయితే.. మానవ హక్కుల ఉల్లంఘనకు గురైనట్లే అంటూ లా పాయింట్లు తీసే ఆయన.. 2011 నుంచి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉన్నాడు.
ఎందుకలా అంటే.. తనకు విద్యాబుద్ధులు చెప్పిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మీదనే కేసు వేశాడు. తనకు ఉద్యోగం రాకుండా ఉండటానికి కారణం ఆక్స్‌ఫర్డ్‌వర్సిటీనే అన్నది అతడి ఆరోపణ. అక్కడ టీచింగ్ బాగోలేదని.. తన కెరీర్ కు నష్టం చేసినట్లు వాదిస్తాడు. అంతేకాదు.. ఇదే అంశం మీద కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేశాడు కానీ.. అది వర్క్ వుట్ కాలేదు. ప్రస్తుతం లండన్ లోని కోట్లాది రూపాయిలు విలువైన తన తల్లిదండ్రుల ఫ్లాట్ లో బతికేస్తున్న ఈ పరాన్న జీవి.. తన తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం పొందుతూనే ఉన్నాడు. ఈ వయసులోనే అతడు చేసిన ఖర్చులకు బిల్లుల్ని పే చేస్తున్నారు.
అయితే.. కుటుంబ తగాదాలు.. కేసు వేసిన నేపథ్యంలో తాము అందిస్తున్న ఆర్థిక సాయానికి కోత విధించాలని వారి పేరెంట్స్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. తాను జీవించి ఉన్నంత కాలం తనకు తన తల్లిదండ్రులు నిర్వహణ ఖర్చులు ఇవ్వాలన్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. ఈ కేసును ఎగువ కోర్టుకు అప్పీల్ చేసిన అతడు.. తల్లిదండ్రుల మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి.. ఈ పరాన్నజీవిని ఏం చేద్దాం?