Begin typing your search above and press return to search.

హెడ్లీని ఏడాది కూడా భరించలేకపోయింది

By:  Tupaki Desk   |   16 Feb 2016 4:18 AM GMT
హెడ్లీని ఏడాది కూడా భరించలేకపోయింది
X
పాక్ అమెరికన్ ఉగ్రవాది.. ముంబయి ఉగ్రదాడిలో కీలకపాత్ర పోషించి అమెరికాలో 35 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న డేవిడ్ హెడ్లీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. అతగాడి మాజీ భార్య ఫైజా ఔటాల్హా హెడ్లీతో తనకున్న సంబంధాల్ని వెల్లడించింది. ప్రస్తుతం మొరాకో దేశంలో ఉన్న ఆమెకు.. పంపిన ప్రశ్నలకు జవాబుల్ని ఆమె పంపింది.

దీని ప్రకారం 2007లో తాము పెళ్లి చేసుకున్నట్లుగా ఆమె వెల్లడించింది. ఏడాది తర్వాత హెడ్లీతో తాను తెగ తెంపులు చేసుకోవటంతో పాటు.. అతనికి దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. పెళ్లి చేసుకొని కలిసి ఉన్న ఏడాది కాలంలో రెండుసార్లు భారత్ కు వచ్చినట్లుగా ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా వారు ముంబయి.. కాశ్మీర్ నగరాల్లో తిరిగినట్లుగా పేర్కొంది. పాక్ లో సయిద్ తో పాటు పలువురు ఉగ్రవాదుల్ని కలిసినట్లుగా పేర్కొన్న ఆమె.. హెడ్లీ విపరీత ప్రవర్తన.. ఉగ్రవాదులతో సంబందాలతో విసిగిపోయిన పైజా లాహోర్ పోలీస్ స్టేషన్లోనూ.. అమెరికన్ ఎంబసీలోనూ ఫిర్యాదు చేసింది. హెడ్లీ మైండ్ ఎలా ఉంటుందన్నది అతడి మాజీ భార్య ఇచ్చిన సమాచారమే నిదర్శనంగా చెప్పొచ్చంటున్నారు.