Begin typing your search above and press return to search.

‘లక్ష్మీపూజలో ‘హారీపోటర్’ పుస్తకమా?

By:  Tupaki Desk   |   18 Jun 2016 4:41 AM GMT
‘లక్ష్మీపూజలో ‘హారీపోటర్’ పుస్తకమా?
X
వినేవాడు ఉండే చెప్పే వాడు చెలరేగిపోతారంటే ఊరికే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరమాన్నం బాబా యవ్వారంలో కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది. లైఫ్ స్టైల్ భవన యజమానికి మస్కా కొట్టేందుకు భారీ ప్లాన్ వేసిన పరమాన్నం బాబా శివ పైత్యం అడుగడుగునా కనిపిస్తుంది. మనోడి తెలివితేటలు ఏ రేంజ్ అన్నది అతగాడు చేసే పూజలోనే కనిపించే పరిస్థితి.

డబ్బుల్ని డబుల్ చేస్తానని మాయమాటలు చెప్పే బాబా.. అందుకు చేసిన లక్ష్మీపూజలో ఉంచిన ఒక పుస్తకం గురించి వింటే షాక్ తినాల్సిందే. ఇలాంటోడిని అంత సంపన్నుడు ఎలా నమ్మేశాడన్న సందేహం కలగకమానదు. తాను చెప్పినట్లుగా డబ్బులు డబుల్ అయ్యేందుకు చేసిన లక్ష్మీపూజలో లక్ష్మీ దేవి చిత్తరువుతో పాటు.. మాయలు.. మంత్రాలతో పిల్లల్ని.. పెద్దల్ని విపరీతంగా ఆకర్షించే హ్యారీపోటర్ పుస్తకాన్ని గులాబీ రేకుల మధ్యలో ఉంచటం గమనార్హం. ఇలాంటి పైత్యపు పని చేసినప్పుడైనా అనుమానం రావాల్సి ఉన్నా.. డబ్బులు డబుల్ అయిపోతాయన్న తీపి మాటలతో లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్లకు అవేమీ కనిపించకపోవటం గమనార్హం.