Begin typing your search above and press return to search.
నిత్యపెళ్లికూతురు: 9 పెళ్లిళ్లు..లక్షల్లో మోసం
By: Tupaki Desk | 2 Sep 2021 11:30 PM GMTమన దేశంలో వివాహ బంధానికి ఓ ప్రత్యేకమైన పవిత్రత ఉంది. వేద మంత్రాల, అగ్ని సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసి వివాహం చేస్తుంటారు. కానీ ఈ మహిళ ఈ వివాహ బంధాన్ని ఎగతాళి చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వివాహాలు చేసుకుంది. వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు. ఇది పెద్దల మాట . అంతకన్నా కూడా ఎక్కువ అబద్ధాలే చెప్పి ఆమె ఏకంగా ఆరుగురిని పెళ్లాడింది. దొరికినంత బంగారం మెడలో వేసుకొని ఉడాయించేది. పుట్టింటికని బయలుదేరి, మరో మెట్టినిల్లుపై కన్నేసేది. ఇలా మూడు ముళ్లు ... 9 పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడిన ఈ నిత్య పెళ్లి కూతురి మోసాలు పోలీసులనే ఆశ్చర్య పరుస్తున్నాయి .
హరియాణా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే నాలుగేళ్ల తర్వాత ఏవో కొన్ని కారణాలతో ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మోసాలకు పాల్పడడం ప్రారంభించింది. హరియాణతోపాటు పక్కనే ఉన్న పంజాబ్ లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం భార్యలను కోల్పోయిన వారు, బ్రహ్మచారులే. అవివాహితులను ఎంపిక చేసుకొని మాటల్లో దింపి, భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది.
పెళ్లి జరిగిన పది రోజులకు ఆమె తన డ్రామా మొదలుపెడుతుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. అనంతరం విడాకులు కోరుతుంది. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఈ విధంగా రూ.లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని ఆమె వివాహం చేసుకుంది. ఈమెపై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు. 9వ పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని నిలిపివేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్ ఐవీ ఎయిడ్స్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 8 మంది భర్తలు ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు.