Begin typing your search above and press return to search.
నకిలీ చలాన్ల కుంభకోణం..ఆ ఒక్క జిల్లాలోనే రూ.5.21 కోట్లు
By: Tupaki Desk | 6 Sep 2021 10:30 AM GMTఏపీలో గత కొన్ని రోజులుగా నకిలీ చలాన్ల కుంభకోణం పై రోజుకో వార్త వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తుంది. ఈ శాఖ ఆ శాఖ అని కాదు, అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. లెటెస్ట్ గా సిఎఫ్ ఎం ఎస్ ఖాతాకు ఆలస్యంగా చలాన్లు చేరడంపై అనుమానాలు కమ్ముకున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ తో పాటు అన్ని శాఖల్లో నకిలీ చలాన్ల దందా జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్, రవాణా, మైనింగ్, కార్మిక శాఖల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా సీఎఫ్ ఎం ఎస్ ఖాతాకు చలాన్లు చేరుతున్నాయా లేదా అన్న వివరాలు సేకరిస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని గాంధీనగర్, గుణదల, పటమట, జిల్లాలోని కంకిపాడు, మండవల్లి, నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు 772 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.5.21 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ కట్టకుండా దస్తావేజు లేఖర్లు కొల్లగొట్టినట్టు తేల్చారు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఈ ఆరింటిలో ఒక్క మండవల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే 581 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.62 కోట్లు ఖజానాకు కన్నం పెట్టినట్టు తేల్చారు. ఇది రాష్ట్రంలో నకిలీ చలాన్ల ద్వారా జరిగిన అవినీతిలో కెల్లా ఇదే అధిక మొత్తం. అలాగే విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 143 దస్తావేజులకు సంబంధించి రూ.1.82 కోట్ల స్వాహా జరిగినట్టు తనిఖీల్లో గుర్తించారు.
ఈ నకిలీ చలాన్ల వ్యవహారం వెలుగు చూసినప్పట్నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సొమ్ము రికవరీపై దృష్టి సారించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తి యజమాని నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును వసూలు చేసి, తప్పుడు మార్గాల్లో మార్ఫింగ్ ద్వారా దస్తావేజు లేఖర్లు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో సంబంధిత యజమానులకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జరిగిన మోసంపై కంగుతిన్న సదరు యజమానులు ఆయా దస్తావేజు లేఖరులపై ఒత్తిడి పెంచడంతో వారు స్వాహా చేసిన సొమ్మును క్రమంగా రికవరీ చేస్తూపోతున్నారు.
జిల్లాలో నకిలీ చలాన్ల ద్వారా కొల్లగొట్టిన రూ.5,21,27,931లో ఇప్పటివరకు రూ.2,72,22,719 లను (52.22 శాతం) అధికారులు రికవరీ చేశారు. మిగతా రూ.2,49,05,212 సొమ్ము వసూలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్ తెలిపారు. నకిలీ చలానాల కుంభకోణం సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారులు నకిలీ చలానాలతో కోట్ల రూపాయిలు అక్రమంగా కూడబెట్టారన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు.