Begin typing your search above and press return to search.
బోగస్ కంపెనీలతో ఐ అండ్ పీఆర్ లో ప్రకటనల కుంభకోణం
By: Tupaki Desk | 28 Sep 2021 8:30 AM GMTఅవినీతికి తావేవీ లేదన్నట్లు ఏ రంగంలో చూసినా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వం సొమ్మును అక్రమంగా కాజేసి జేబులు నింపుకుంటున్నారు. ఇది ప్రకటన రంగంలోనూ జరగడం గమనార్హం. ఐ అండ్ పీఆర్ లో అడ్వర్టయిజింగ్ పేరిట కోట్ల రూపాయల కుంభకోణం ఆలస్యంగా బయటపడింది. తెలంగాణ రాష్ట్ర సమాచారం శాఖ, డీఐపీఆర్ అధికారులు కలిసి 11 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఇందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఇక పత్రికల్లో యాడ్స్ పేరిట మరిన్ని నిధులు నొక్కేశారు. ఆలస్యంగానైనా భయటపడ్డ ఈ కుంభ కోణం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
అమెరికాకు చెందిన అడ్వర్టయిజింగ్ సంస్థ వైర్ అండ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ (డబ్ల్యూపీపీ) అనే కంపెనీ అనుబంధంగా హైదరాబాద్ లో జేడబ్ల్యూటీ పేరిట సంస్థను నెలకొల్పారు. దీనినిక మైండ్ సెట్ అడ్వర్టయిజింగ్ సంస్థ టేకోవర్ చేసింది. ఈ సంస్థకు పౌర సరఫరాల శాఖ నుంచి అధిక ఆదాయం వచ్చేది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రకటనలు ఇచ్చే బాధ్యతను తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి యాడ్స్ తయారు చేసి ఇచ్చేది. అయితే ఇలా తయారు చేసిన యాడ్స్ ను నేరుగా మీడియాకు ఇవ్వకుండా ‘వెండర్ ఏ’ అనే సంస్థకు ఇచ్చేది. వెండర్ ఏ అనే సంస్థ పలు పత్రికలకు యాడ్స్ ఇచ్చి వాటికి సంబందించిన బిల్లులు తయారు చేసేది. ఇందుకు 10 శాతం కమిషన్ తీసుకుంటుంది.
అయితే జేడబ్ల్యూటీ మైండ్ సెట్ సంస్థ మీడియా సంస్థలు ఇచ్చిన బిల్లులు చూసుకోకుండానే ‘వెండర్ ఏ ’ అనే కంపెనీకి చెల్లింపులు చేసేది. ఇక్కడ తెలంగాణ డీఐపీఆర్ నేరుగా మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వకుండా జేడబ్ల్యూటీ మైండ్ సెట్ సంస్థ ద్వారా ఇచ్చేది. ఇందులో భాగంగా బిల్లులను కార్డు రేట్ ప్రకారం చెల్లించేది. మీడియా సంస్థల నిర్ణయించిన ధరకు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యాడ్స్ ను ఇవ్వడాన్ని కార్డు రేట్ అంటారు. ఈ బాధ్యతలను డీఐపీఆర్ మైండ్ సెట్ సంస్థ ద్వారా ‘వెండర్ ఏ’ అనే కంపెనీ అప్పగించి చెల్లింపులు చేస్తుంది.
వెండర్ ఏ సంస్థ ప్రభుత్వం నుంచి కార్డు రేట్ ప్రకారం బిల్లులు తీసుకొని పత్రికలకు మాత్రం యాడ్స్ స్పేస్ కొనుగోలు చేసి ప్రకటనలు ఇస్తోంది. అంటే. ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల బిల్లు తీసుకొని పత్రికలకు 60 వేల వరకు యాడ్స్ ఇస్తోంది. మిగతా 40 వేలు మాత్రం కొంత కంపెనీలు తీసుకొని మరికొంత డీపీఐఆర్ అధికారులకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కోట్లల్లో కుంభకోణం జరగడంత తాజాగా బయటపడింది. అడ్వర్టయిజింగ్ కంపెనీలు, డీపీఐఆర్ అధికారులు కలిసి ప్రభుత్వానికి కోట్లలో నష్టం తెచ్చారు.
ఇదిలా ఉండగా 2015లో జూన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటనల పేరిట భారీగా కుంభకోణం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన యాడ్స్ తయారు చేసే బాధ్యతను జేడబ్ల్యూటీ మైండ్ సెట్ సంస్థకు డీఐపీఆర్ అప్పగించింది. ఈ కాంట్రాక్టు విలువ 11.75 కోట్లు. అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని యాడ్స్ కు కేటాయించగా జేడబ్ల్యూటీ సంస్థ మాత్రం పత్రికలకు యాడ్స్ ఇవ్వకుండా మొత్తం నొక్కేశారు. మరోవైపు ‘వెండ్ ఏ’ కంపెనీ భోగస్ బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి వసూలు చేసుకున్నాయి.
జైడబ్ల్యూటీ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని 2015 జూలైలోనే అమెరికాలోని డబ్లూపీపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు బాధ్యతను ఆ సంస్థ ఫైనాన్సియల్ డైరెక్టర్ కు అప్పగించింది. డైరెక్టర్ విచారణ చేసి ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక అందించారు. దీంతో డబ్ల్యూపీపీ పట్టించుకోలేదు. 2017లో మరో మూడు ఫిర్యాదులు అందడంతో డబ్ల్యూపీపీ ఈసారి దర్యాప్తు బాధ్యతలను బయటి సంస్థకు అప్పగించింది. దీంతో డీఐపీఆర్లోని అవినీతి అధికారికి, హైదరాబాద్లోని డబ్ల్యూపీపీ సీఈవోకు సంబంధాలున్నాయని తేల్చారు. దీంతో సీఈవోను కంపెనీ నుంచి తొలగించారు. ఆ తరువాత జేడబ్ల్యూటీ సంస్థను కూడా మూసేశారు. ఈ వ్యవహారమంతా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ దృష్టికి రావడంతో ఆ దేశంలోని డబ్ల్యూపీపీ సంస్థకు జరిమానా విధించింది.