Begin typing your search above and press return to search.

'క్యాష్ బ్యాక్' లో ఫేక్ కరెన్సీ

By:  Tupaki Desk   |   12 Nov 2016 6:36 AM GMT
క్యాష్ బ్యాక్ లో ఫేక్ కరెన్సీ
X
మోడీ గవర్నమెంటు ఇచ్చిన క్యాష్ బ్యాక్ ఆఫర్ సందర్భంగా కొందరు నకిలీ నోట్లను కూడా బ్యాంకులకు అంటగట్టేస్తున్నారు. పాత 500 - 1000 నోట్లను జమ చేయడానికి వస్తున్న వారు - విత్ డ్రా చేసుకోవడానికి వస్తున్న వారితో బ్యాంకులు కిక్కిరిసిపోతున్న వేళ సందట్లో సడేమియాలా దొంగ నోట్లను బ్యాంకులో జమ చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఒడిశాలో రాజధాని భువనేశ్వర్ శివారుల్లోని ఖుర్దా పట్టణంలో ఇలాంటి ఘటనే జరిగింది.

ఖుర్దాలో సుమిత్ కుమార్ అనే యువకుడు నకిలీ నోట్లను జమ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. మొత్తం 2.5 లక్షల రూపాయలను జమ చేయడానికి ఎస్బీఐ కు వచ్చాడు సుమిత్. ఇందులో రూ. 1000 నోట్లు 42- రూ. 500 నోట్లు 10 నకిలీవి ఉన్నాయి. వీటిని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి సుమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను ఓ బ్యాంకు అధికారి కుమారుడినని... తన తండ్రి డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చానని పోలీసులకు సుమిత్ తెలిపాడు.

ఈ సంగతి ఎలా ఉన్నా కానీ ఇప్పుడు జరుగుతున్న నోట్లు వెనక్కు తీసుకునే వ్యవహారంలో నకిలీ నోట్లూ బ్యాంకులకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా డిపాజిట్లు తీసుకునే కౌంటర్లలో నోట్లను లెక్కించే - నకిలీలను గుర్తించే పరికరాలు ఉంటాయి. కానీ... అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం.... వాటితో పాటు రూ.4 వేల వరకు పెద్ద నోట్లు ఇచ్చి అప్పటికప్పుడు నగదు మార్చుకుని వెళ్లడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లన్నిటిలో నగదు లెక్కింపు - దొంగనోట్ల గుర్తింపు పరికరాలు లేవు. పైగా జనం బారులు తీరడంతో సిబ్బందిపైనా తీవ్ర ఒత్తిడి ఉంటోంటి. కేవలం లెక్క చూసుకుని మాత్రమే నగదు మార్పిడి చేస్తున్నారు. ప్రతి నోటునూ పట్టిపట్టి చూసి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దొంగనోట్లు గుర్తించే పరికరాలు లేని కౌంటర్లలో ఇలా దొంగనోట్లను మార్చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/