Begin typing your search above and press return to search.
సంచలనంగా మారిన అమ్మ వీలునామా!?
By: Tupaki Desk | 19 March 2017 10:35 AM GMTఅమ్మ అంశం మరోసారి షాకింగ్ గా మారింది. అనారోగ్యంతో అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి సంచలనాల మీద సంచనాలు చోటు చేసుకోవటం.. ప్రతి విషయంలోనూ చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తుండటం తెలిసిందే. ఇటీవల ఒక వ్యక్తి తాను దివంగత అమ్మ జయలలిత కొడుకునంటూ బయటకు రావటమే కాదు.. తన తల్లి తనను వారసుడిగా ప్రకటించే ప్రయత్నం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే తన తల్లి (జయలలిత)పై దాడి జరిగిందన్నారు.
ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారిన సమయంలోనే.. సదరు వ్యక్తి.. జయలలిత ఆస్తులన్ని తనకే చెందుతాయంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. అమ్మ కొడుకుగా చెప్పుకుంటున్న ఈరోడ్ జిల్లా వాసి కృష్ణమూర్తి విడుదల చేసిన దస్తావేజులు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. జయ కుమారుడిగా నిరూపించే ఆధారాల్ని చెన్నై పోలీస్ కమిషనర్ గా అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి వి అంటున్న కొన్ని దస్తావేజులు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. వైరల్ గా మారిన.. ఈ దస్తావేజులో ఏమున్నదంటే...
"జె. జయలలిత అనే నేను తెలుగు చిత్రాల్లో నటించే సమయంలో హీరో శోభన్ బాబును ప్రేమించాను. 1982లో అతడ్ని పెళ్లి చేసుకున్నాను. 1985 ఫిబ్రవరి 15న ఒక అబ్బాయికి జన్మనిచ్చాను. ఎంజీఆర్‌కు నాపై ఎక్కువ ప్రేమాభిమానాలు ఉండటంతో ఆయన నన్ను చూసుకునేందుకు మా ఇంటికి వచ్చి పోతుండేవారు. దీంతో నా భర్త శోభన్ బాబుకు.. నాకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడిపోవాలని అనుకున్నాం. నాకు పుట్టిన మగబిడ్డ నాకే చెందుతాడని నా భర్తకు చెప్పగా.. నన్నే పెంచుకొమ్మన్నారు. ఒక సినిమా షూటింగ్ లో పరిచయమైన ముత్తుచ్చువుండ్లీపాళయంకు చెందిన వసంతామణికి నా బిడ్డను ఇచ్చి పెద్ద చేయాలని కోరాను. ఇది నా భర్త శోభన్ బాబు.. నేను మనఃస్ఫూర్తిగా రాసిచ్చిన వీలునామా" అని ఉంది. ఇందులో వాస్తవం సంగతి ఎలా ఉన్నా.. ఈ వీలునామా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/