Begin typing your search above and press return to search.
పుట్టగొడుగుల్లా దొంగ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్
By: Tupaki Desk | 4 Nov 2019 9:59 AM GMTయాక్టింగ్ లో శిక్షణనిస్తాం... డైరెక్షన్ చేయాలని వుందా? .. మరెందుకు ఆలస్యం మా ఇనిస్టిట్యూట్ లో చేరిపోండి. ఫ్రీ వర్క్ షాప్ లు.. ఎంట్రీ ఫ్రీ.. ఫీజు అవసరం లేదు.. లిమిటెడ్ సీట్లు మాత్రమే... ఆలస్యం చేస్తే ఆ అవకాశం కూడా మిస్సవుతారు.. సినిమాల్లో అవకాశాలు మేమే కల్పిస్తాం.. ఇదీ రంగుల ప్రపంచం మాటున మాయగాళ్ల ప్రకటనలు.. అయితే ఇవి నమ్మాలా? వీటిలో నిజాయితీ ఎంత? అంటే .. ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
టాలీవుడ్ లో పేరున్నసంస్థలు డెడికేటెడ్‌గా ఆసక్తి వున్న వారికి శిక్షణనిస్తూ ఇండస్ట్రీలో ఛాన్సులు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కొన్ని పేరూ ఊరూ లేని సంస్థలు మాత్రం శిక్షణ ఇవ్వకుండానే ఆస్కార్ అవార్డు కొట్టేసినంత బిల్డప్పులిస్తున్నాయి. కనీసం ఆ ప్రకటన ఇచ్చినవాడు ఎవడో కూడా ఎవరికీ తెలీదు.
శిక్షణ పూర్తి కాకుండానే డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తామని మభ్య పెడతారు. మేమే స్వయంగా సినిమా నిర్మిస్తాం.. అందులో ఛాన్సులిస్తామని ఊకదంపుడు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఆ పేరుతో ఔత్సాహిక అభ్యర్థుల నుంచి భారీ మొత్తాల్ని గుంజేస్తున్నారు. చెప్పినట్టే ట్రైనింగులు ఇస్తారు. కానీ క్రియేటివ్ రంగంలో ఇది సరిపోదు. ట్యాలెంటుతో పాటు దూసుకుపోయే చొరవ చాణక్యం.. కూడా ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలి. ఇక పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అంత పక్కాగా ఇతర ఇనిస్టిట్యూట్ లు ఉంటాయా? హైదరాబాద్ లో బిగ్ బ్యానర్ స్టూడియోలైన.. అన్నపూర్ణ స్టూడియోస్ ఫిలిం ఇనిస్టిట్యూట్.. రామనాయుడు ఫిలిం ఇనిస్టిట్యూట్ లు.. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థలు ఓ వైపు క్రమబద్ధంగా యాక్టింగ్.. డైరెక్షన్ కోర్సుల్లో శిక్షణ నిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీళ్లు భారీగానే ఫీజులు వసూలు చేస్తారు. వీళ్లకు పోటీగా.. ఊరూ పేరూ లేని సంస్థలు ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల్ని నమ్మారో కొంప కొల్లేరే. ఆలోచించి ఇలాంటి మోసగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తపడితే మంచిది.