Begin typing your search above and press return to search.

ఫేక్ లేఖనా?: కేసీఆర్ పై ఈటల ప్రశంసలు?

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 PM GMT
ఫేక్ లేఖనా?: కేసీఆర్ పై ఈటల ప్రశంసలు?
X
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుంచి బయటకు పంపడం.. దానికి ప్రతిగా ఈటల టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీలో చేరడం.. చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మాటలయుద్ధం నడిచింది.

కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టుగా పోరు సాగింది. కేసీఆర్ తీరుపై, మంత్రులపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ తరుఫున రెడీ అవుతూ ఇప్పటి నుంచే తిరగడం ప్రారంభించాడు.

అయితే టీఆర్ఎస్ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న ఈటల రాజేందర్ కు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక లేఖ షాకిచ్చింది. 'ఈటల రాజేందర్' పేరిట విడుదలైన ఈ లేఖలో ‘సీఎం కేసీఆర్ ని క్షమాపణలు అడుగుతూ.. ఆయనను ఆకాశానికి పొడిగేస్తూ' ఓ లేఖ బయటకు వచ్చింది. ఈ లేక చూసిన వారంతా షాక్ అయ్యారు. నిన్నటిదాకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఈటల ఇక కేసీఆర్ ను శరణు వేడుతూ లేఖ రాయడం ఏంటి అని కంగారుపడ్డారు. ఆ లేఖలో 'తనను క్షమించాలని.. ఈ ఒక్కసారి తమ్ముడిగా భావించి వదిలిపెట్టాలని' ప్రాధేయపడ్డట్టుగా ఉంది.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతున్న ఈటల దీనిపై భగ్గుమన్నారు. కొందరు కావాలనే తన ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ఈ లేఖ సృష్టించారని.. ఇది టీఆర్ఎస్ పని అని ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్ తాజాగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ మీడియాలోఎలా సర్క్యూలేట్ అయ్యిందనేది అంతుబట్టడం లేదు. ఇలా ఫేక్ లేఖతో ఈటలను బుక్ చేశారా? అన్న చర్చ కూడా సాగుతోంది.