Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో కరోనా పై ఫేక్ న్యూస్ ప్రచారం ...ముగ్గురు అరెస్ట్ !

By:  Tupaki Desk   |   17 March 2020 5:45 AM GMT
వాట్సాప్ లో కరోనా పై ఫేక్ న్యూస్ ప్రచారం ...ముగ్గురు అరెస్ట్ !
X
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలలో 1 ,82 , 609 కేసులు నమోదు కాగా..7171 మంది ప్రాణాలు విడిచారు. చైనా లో అత్యధికంగా 80 వేలకి పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 3226 మంది మరణించారు. ఆ తరువాత ఇటలీలో కరోనా భాదితులు ఎక్కువగా ఉన్నారు. ఈ మహమ్మారి మన దేశంలోకి కూడా రావడంతో ప్రజలు కాస్త భయాందోళనలకు గురవుతున్నారు. అయితే , ఈ కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి వైరస్ ని ఎదుర్కోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తుంది.

ఇప్పటికే కరోనా వైరస్ భయంతో వణికి పోతున్న దేశ ప్రజానీకానికి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని , ఏ పని చేసినా , చేసే ముందు తప్పకుండా చేతులు నీట్ గా కడుక్కోవాలి అని చెప్తున్నారు. అలాగే కరోనా వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్టు అనుమానం వచ్చినా కూడా దగ్గర్లోని హాస్పిటల్ లోకి వెళ్లి , చెక్ చేపించుకోవాలని చెప్తున్నారు. అయితే , మరికొంతమంది కరోనాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే , ఎవరైనా కరోనా పై ఫేక్ వార్తలని ప్రసారం చేస్తే ,,కఠిన చర్యలు తప్పవు అని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా కూడా ముగ్గురు యువకులు కరోనా వైరస్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేసారు.

దీనితో స్థానిక ప్రజానీకం ఆందోళనకి గురైయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి కరోనా పై సోషల్ మీడియాలో ఫేక్ వార్తని షేర్ చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ సోకి ఓ వ్యక్తి మృతి చెందాడంటూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి లో వదంతులు వ్యాప్తి చెందాయి. పట్టణానికి చెందిన కొంత మంది కరోనా బారిన పడ్డారని.. కరోనా సోకినా నిర్లక్ష్యం చేయడం తో ఓ వ్యక్తి మరణించాడని ఒక ఫేక్ వార్తని, ఫొటోను మార్ఫింగ్‌ చేసి భరత్‌ అనే యువకుడు వాట్సాఫ్ గ్రూప్‌లో షేర్ చేశారు. వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ ఆధారంగా మర్రి శివకుమార్, జూపల్లి భరత్‌కుమార్, ఏంకర్ల బాలరాజును నిందితులుగా గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.